34 Couples Married Again: రెండోసారి వివాహం చేసుకున్న 34 జంటలు.. ఎక్కడ, ఎందుకో తెలుసా? - 34 Couples Married Again in Seelamvaripalli

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 18, 2023, 3:41 PM IST

34 Couples Married Again in Seelamvaripalli: ప్రకాశం జిల్లా సి.ఎస్‌.పురం మండలం శీలంవారిపల్లిలో పాత జంటలే కొత్తగా మళ్లీ వివాహం చేసుకొని ఒక్కటైన ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. గ్రామంలో ఎలికా, దుగ్గని వంశస్థుల వారు ఐదు రోజులుగా నాగారపమ్మ తిరునాళ్లు నిర్వహించారు. కొలుపుల ముగింపు సందర్భంగా ఎలికా, దుగ్గని కుటుంబాల్లోని దంపతులే మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వివాహ దుస్తులు ధరించి, పూలమాలలు వేసుకొని, తలపాగాలు పెట్టుకుని, బాసికాలతో పెళ్లి పీటలపై కూర్చున్నారు. 34 జంటలు(34 Couples) ఇలా మళ్లీ వివాహాలు చేసుకున్నాయి. తిరునాళ్లల్లో పెళ్లిళ్లు చేసుకున్న వారిని మహిళలు, పెద్దలు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వివాహాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ వివాహాల ఘట్టాన్ని చూసేందుకు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు  అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం వివాహమైన జంటలతో స్థానిక ప్రజలు, ఉత్సాహవంతులు సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు  హడావిడి చేశారు. నాగారపమ్మ తిరునాళ్ల సందర్భంగా  గత ఐదు రోజులుగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.