Elephants In Thotakanuma చిత్తూరు జిల్లాలో పంటపొలాలను ధ్వంసం చేస్తున్న గజరాజులతో రైతుల బెంబేలు.. - తెలుగు ప్రధాన వార్తలు
🎬 Watch Now: Feature Video
Elephants In Thotakanuma Damage Crops : చిత్తూరు జిల్లా వి.కోట మండలం తోటకనుమ పరిసరాల్లో ఏనుగుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం రాత్రి కర్ణాటక ప్రాంతంలోని ములభాగల్లు నుంచి తోటకనుమ మీదుగా కైగల్లు అటవీ ప్రాంతానికి 14 ఏనుగులు చేరుకున్నాయి. తోటకనుమ సమీపంలోని సమ్మె గౌని చెరువులో జరగాలాడుతూ సాయంత్రం వేళ సేద తీరాయి. ఆపై వాటి పైకి బాణాసంచా విదరడంతో నెమ్మదిగా చెరువులో నుంచి పంటపొలాల మీదుగా అటవీ మార్గం పట్టాయి. మార్గమధ్యంలో మామిడి, టమోటా, బీన్స్ ఇతర పంటలను తొక్కుతూ తింటూ ధ్వంసం చేస్తూ విహారం కొనసాగింది. ఏనుగుల రాకను గమనించిన పరిసర ప్రాంతాల్లోని ప్రజలు సెల్ఫోన్లో వాటిని చిత్రీకరించిన ప్రయత్నించగా గున్న ఏనుగులు ఉన్న కారణంగా ఏనుగుల మందలోంచి ఘీకారాలు వినిపించాయి. దీంతో భయపడ్డ స్థానికులు వాటి వైపు వెళ్లేందుకే జంకారు.
స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు తోటకనుమ నుంచి కైగల్ అటవీ ప్రాంతం వైపు ఏనుగులను మళ్లించారు. దండికుప్పం ప్రాంతంలో ఏనుగులు ఇప్పటికే పంటలను ధ్వంసం చేయడంతో తిరిగి ఎక్కడ పంటల వైపు వస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.