శాండ్ ఆర్ట్ తో.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు! - గుంటూరు జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12197873-597-12197873-1624162715208.jpg)
పసిప్రాయంలో అడుగులకు ఆసరాగా నిలుస్తూ.. నీతి కథలతో నిద్రపుచ్చుతాడు నాన్న. తప్పులు చేస్తే కఠినంగా శిక్షించిన ఆ చేతులే.. కష్టం వస్తే కంచె వేసి కాపు కాస్తాయి. నవమాసాలు మోసేది తల్లి అయితే.. నడక నేర్పుతూ జీవితపు పాఠలను దిద్దిస్తాడు తండ్రి. పిల్లల ఎదుగుదలనే తన ఉన్నతిగా భావిస్తూ.. వారి కోసం నిరంతరం తపిస్తూ ఉంటాడు. అలాంటి తండ్రులందరికి కృతజ్ఞతలు తెలిపే పండుగే ఫాదర్స్ డే. నేడు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాకు చెందిన శాండ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ తనదైన రీతిలో కళాత్మకంగా శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి తన పిల్లల వేలు పట్టి నడిపించి.. ఆట పాటలు నేర్పి.. ఉన్నత స్థాయికి ఎదిగే వరకూ వెన్నుదన్నుగా నిలిచే వైనాన్ని ఈ వీడియోలో చిత్రీకరించారు.
Last Updated : Jun 20, 2021, 10:52 AM IST