PRATHIDWANI: అడుగడుగునా అన్నింటా కల్తీమయం..ప్రమాదంలో ప్రజల ప్రాణాలు - అడుగడుగునా అన్నింటా కల్తీమయం
🎬 Watch Now: Feature Video
మార్కెట్ల్లో ఆహార పదార్థాలు మొదలుకొని వంట సరుకుల వరకు ఎక్కడ చూసినా కల్తీ. బిర్యానీ సెంటర్, ఐస్‌క్రీం పార్లర్, కిరాణం దుకాణం కాదేదీ కల్తీకి అనర్హం.. అన్నట్లు సాగుతోంది కల్తీల చీకటి వ్యవహారం. అడుగడుగునా నకిలీలు పాగా వేసిన పరిస్థితుల్లో సామాన్యుల నుంచి ధనికుల వరకు నోట్లో నాలుగు ముద్దలు నమ్మకంగా పెట్టుకోలేని దుస్థితి నేడుంది. ఎందుకీ దయనీయ పరిస్థితి, మార్కెట్లో కల్తీల నివారణకు పనిచేస్తున్న పర్యవేక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? వినియోగదారులకు ఎలాంటి చైతన్యం అవసరం? ఇదే అంశంపై నేడు ప్రతిధ్వని..