ఆకాశ వీధిలో అందాల దృశ్యం - రామోజీ ఫిలిం సిటీ దగ్గర మబ్బుల వర్ణాలు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
భాగ్య నగర శివారులో అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. రామోజీ ఫిలిం సిటీ సమీపంలోని కొత్తగూడ వద్ద ఆకాశం మేఘావృతమై అద్భుతమైన వర్ణాలుగా కనిపించింది. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. సాయంత్రం 7 గంటల సమయంలో వివిధ వర్ణాలు కలగలిసిన ఈ దృశ్యాన్ని ప్రయాణికులు ఆస్వాదించారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఈటీవీ భారత్ వీక్షకులు ఒకరు ఈ దృశ్యాలను చిత్రీకరించి పంపారు.