ప్రతిధ్వని: వినియోగదారుల హక్కుల చట్టం ఏం చెబుతోంది..? - prathidwani on 21-07-2020
🎬 Watch Now: Feature Video
వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. 1986 నాటి వినియోగదారుల రక్షణ చట్టానికి మరింత పదును పెడుతూ.. 2019 చట్టాన్ని రూపొందించారు. ఈ కొత్త చట్టం ప్రకారం వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమడే వ్యాపారులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. మోసపూరిత ప్రకటనలు ఇస్తే జైలు శిక్ష వేస్తారు. కల్తీ వస్తువులతో మరణానికి కారణమైతే జీవితఖైదు పడుతుంది. కొత్త చట్టం ఈ కామర్స్ వినియోగదారులకు మరింత భద్రతను కల్పిస్తుంది. వినియోగదారుల వివాదాల పరిష్కారానికి జిల్లా, రాష్ట, జాతీయస్థాయిల్లో కమిషన్లు పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కుల రక్షణ కోసం అమల్లోకి వచ్చిన కొత్త చట్టంలోని ప్రధాన అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.