గజరాజు బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్‌లోని కార్బెట్ నేషనల్ పార్క్ అధికారులు 'సావన్' అనే ఓ ఏనుగుకు మూడో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గజరాజుకు ఇష్టమైన ఆహారంతో 30కేజీల కేకును తయారు చేసి కట్ చేశారు. వెన్నతో కూడిన బ్రెడ్, చపాతి పిండితో ఈ కేకును తయారుచేశారు. దానిపై అరటికాయలు సహా మిగతా పండ్లను అమర్చారు. ఇక ఆ ఏనుగును పూలమాలతో అలంకరించారు. ఈ వేడుకను సందర్శకులు ఆసక్తికరంగా వీక్షించారు.