బడికెళ్లేందుకు విద్యార్థుల సాహసం.. ఏదైనా జరిగితే..! - వరదలు
🎬 Watch Now: Feature Video
Rains in Vizianagaram: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయనగరం జిల్లాలో నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గజపతినగరం మండలం మర్రివలస సమీపంలో చంపావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. ఆ మార్గం గుండా వెళ్లాలంటే నడుము లోతు ప్రవాహాన్ని దాటాల్సిందే. దీంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. గ్రామస్థులు పిల్లలను ప్రమాదకరంగా.. బండిపై నది దాటిస్తున్నారు. వరదలు వచ్చిన ప్రతిసారీ ఇదే తీరని మర్రివలస గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదమని తెలిసినా తప్పడం లేదని వాపోతున్నారు. తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST