ప్రధాని మోదీకి.. తెలంగాణ ఎందుకు గౌరవమివ్వాలి..?: కేటీఆర్ - telangana formation day
🎬 Watch Now: Feature Video
KTR Comments on PM Modi: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానికి సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే స్వాగతం పలకలేదనే విమర్శలపై మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఉత్త చేతులతో వస్తాం. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తామంటే.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి మండిపడ్డారు. కారణాలు ఏమైనప్పటికీ.. వారే ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ప్రధాని మోదీ భారత్ బయోటెక్ సందర్శనకు వచ్చారన్న మంత్రి కేటీఆర్.. అప్పుడు పీఎం కార్యాలయం ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ఉత్తరం రాసిందన్నారు. అప్పుడు అవసరం లేని సీఎం ఇప్పుడెందుకు అని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రధాని 8సార్లు వచ్చారు.. కానీ 8 పైసలు తెచ్చారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వని ప్రధానమంత్రికి ఎందుకు గౌరవం ఇవ్వాలన్నారు. ఆయన గుజరాత్కే ప్రధానిలా వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST