పళ్లతో 165 కిలోల బరువును ఎత్తిన జవాన్​.. గిన్నిస్​ సహా 9 ప్రపంచ​ రికార్డులు కైవసం - hammerhead man of india

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 8, 2023, 7:35 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

బిహార్​ కైమూర్​కు చెందిన ధర్మేంద్ర కుమార్​ అరుదైన ఫీట్ చేశారు. 165 కిలోల బరువును పళ్లతో ఎత్తి రికార్డు సృష్టించారు. సుమారు 10 సెకన్ల పాటు 165 కిలోల బరువును గాలిలోకి ఎత్తారు. ఆయన ఇప్పటివరకు గిన్నిస్​ బుక్​ సహా 9 ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించారు. హ్యామర్​ హెడ్​మాన్​ ఆఫ్ ఇండియాగా పేరుపొందారు ధర్మేంద్ర. ఆయన ఇటీవలే బైక్​ను భుజాలపై ఎత్తుకుని 100 మీటర్ల దూరం పరిగెత్తారు. అంతకుముందు తలతో కొబ్బరికాయలు పగలకొట్టడం, పళ్లతో ఇనుమును వంచడం లాంటి ఫీట్లు చేశారు.  

"బంగాల్​ నుంచి వచ్చిన ప్రజలు పళ్లతో 165 కిలోల బరువు ఎత్తాలని నాకు సవాల్​ విసిరారు. నేను దానిని స్వీకరించాను. 165 కిలోల బరువును ఎత్తి.. నేతాజీ వరల్డ్​ రికార్డులో స్థానం సంపాదించాను. మీ అందరి ఆశీస్సుల వల్లే ఈ రికార్డు సాధించగలిగాను. మీ ఆశీస్సులు ఇలాగే ఉంటే భవిష్యత్తులో మరెన్నో రికార్డులు సాధిస్తాను."అని చెప్పారు ధర్మేంద్ర. కైమూర్​ జిల్లాలోని రామ్​గఢ్​కు చెందిన ఆయన ప్రస్తుతం త్రిపుర రైఫిల్స్​లో జవాన్​గా విధులు నిర్వర్తిస్తున్నారు.  

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.