ఈ జలపాత అందాల్ని చూడటానికి రెండుకళ్లు చాలవంతే - మహబూబ్నగర్లో భీముని పాదం జలపాతం
🎬 Watch Now: Feature Video
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కొమ్ముల వంచ అటవీప్రాంతంలోని భీముని పాదం జలపాతం సందర్శకులతో సందడిగా మారింది. భారీ వర్షానికి అటవీ ప్రాంతంలో కొండల మధ్య నీటి ఉద్ధృతి పెరగడంతో జలకళ సంతరించుకుంది. పచ్చని అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఉన్న ఈ జలపాతం కనువిందు చేస్తోంది. దసరా సెలవులు కావడంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పిల్లలతో కలిసి వచ్చి సరదాగా గడుపుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST