అప్పటివరకు హుషారుగా డ్యాన్స్.. ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు.. గుండె ఆగి... - పార్వతి వేషధారణలో డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16315861-thumbnail-3x2-dead.jpg)
జమ్ముకశ్మీర్‌లో గణేశ్ ఉత్సవాల్లో అపశ్రుతి జరిగింది. జమ్ము జిల్లాలోని బిశ్నాలో జరిగిన గణేశ్ చతుర్థి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ యోగేశ్ గుప్తా(20) అనే యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. యోగేశ్ పార్వతిదేవి వేషధారణలో ఉన్నాడు. అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల నృత్యం చేస్తూ స్టేజ్‌పైనే పడిపోయాడు. ఈ విషయం తెలియని నిర్వహకులు, ఆడియన్స్ ఎవరూ కాసేపు యువకుడి దగ్గరకు వెళ్లలేదు. కాసేపటికి శివుని వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి యోగేశ్‌ను లేపగా ఎంతకీ అతడు స్పందించలేదు. అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. యోగేశ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన బుధవారం జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST