టీమ్ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే.. మన వాళ్ల విజయం కోసం పాకిస్థానీయులు ప్రార్థించడం ఎప్పుడైనా చూశారా? ఆదివారం ఆ అరుదైన దృశ్యమే చూడబోతున్నాం. ఎందుకంటే ఆ జట్టు సెమీస్ చేరడం భారత్ చేతుల్లోనే ఉంది. టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపై గెలిచి ఆ జట్ల సెమీస్ అవకాశాలను దెబ్బ తీస్తేనే పాక్ ముందంజ వేయడానికి అవకాశముంటుంది.
భారత్, జింబాబ్వేల చేతుల్లో ఓడిన పాక్ ఇప్పుడు గ్రూప్-2లో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌లను ఓడించినా.. సమీకరణాలు కలిసి రాకుంటే పాక్‌కు సెమీస్ బెర్తు దక్కదు. అందుకే భారత్ మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాలని దాయాది జట్టు కోరుకుంటోంది. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ కంటే ముందు పెర్త్‌లోనే పాక్.. నెదర్లాండ్స్‌ను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే దాయాది జట్టు సెమీస్ అవకాశాలకు తెరపడ్డట్లే.
ఇవాళ సాయంత్రం 4.30కు దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఇప్పటి వరకరూ టీ20 ప్రపంచకప్‌లో భారత్-దక్షిణాఫ్రికా 5 మ్యాచ్‌ల్లో తలపడగా.. నాలుగుసార్లు భారత్ నెగ్గితే, ఒక్కసారే దక్షిణాఫ్రికా గెలిచింది.
ఇవీ చదవండి : స్టన్నింగ్ క్యాచ్.. గాల్లోకి ఎగిరి మరీ.. సచిన్ బంతిని భలే పట్టేశాడుగా!