ETV Bharat / t20-world-cup-2022

T20 World Cup: పాకిస్థాన్​కు గట్టి షాక్​.. రెండోసారి వరల్డ్ కప్​ను ముద్దాడిన ఇంగ్లాండ్ - టీ20 వరల్డ్ కప్​ 2022 ఛాంపియన్

టీ20 వరల్డ్​ కప్​ మహాసమరానికి తెరపడింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్​ మ్యాచ్​లో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్​​​ విజయం సాధించింది. దీంతో రెండో సారి వరల్డ్​ కప్​ను కైవసం చేసుకుంది. అదృష్టంతో ఫైనల్​ చేరుకున్న పాక్​కు గట్టి షాక్​ తగిలింది.

T20 WorldCup England Won
T20 WorldCup England Won
author img

By

Published : Nov 13, 2022, 5:07 PM IST

Updated : Nov 13, 2022, 5:26 PM IST

T20 WorldCup England Won: టీ20 ప్రపంచకప్‌ 2022 విజేతగా ఇంగ్లాండ్‌ నిలిచింది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్‌ని ఎగరేసుకుపోయింది. అదృష్టంతో ఫైనల్​కు చేరుకున్న పాకిస్థాన్​కు బట్లర్​ సేన గట్టి షాక్​ ఇచ్చింది.

లక్ష్య చేధనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ ఐదు వికెట్లు కోల్పోయి, మరో ఓవర్‌ మిగిలి ఉండగానే టైటిల్‌ను సొంతం చేసుకుంది. బెన్‌స్టోక్స్‌ 52(49)* అర్ధశతకంతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ 26(17)తో పాటు హ్యారీ బ్రూక్‌ 20(23), మొయిన్‌ అలీ 19(13) సహకారం అందించారు. ఇంగ్లాండ్‌కు ఇది రెండో టీ20 టైటిల్‌. 2010లో ఇంగ్లిష్‌ జట్టు తొలిసారి టీ20 కప్‌ను సొంతం చేసుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్​.. టైట్​ బౌలింగ్​ మధ్య ప్రత్యర్థి ఇంగ్లాండ్​కు 138 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్​ బాబర్​ అజామ్​(32), షాన్ మసూద్(38) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు రిజ్వాన్(15), హారిస్​(8), ఇఫ్తికార్ అహ్మద్​(0), షాదబ్​ ఖాన్(20), మహ్మద్ నవాజ్(5), వాసిమ్ జూనియర్(4), షహీన్ అఫ్రిది(5), హారిస్ రవూఫ్(1) నిరాశపరిచారు. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 137 పరగులు చేయగలిగారు. ఇంగ్లాండ్​ బౌలర్లు.. సామ్​ కరన్ మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్​, క్రిస్​ జోర్డాన్​​ చెరో రెండు వికెట్లు తీశారు. బెన్ స్ట్రోక్స్​ ఒక వికెట్ పడగొట్టాడు.

Last Updated : Nov 13, 2022, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.