ETV Bharat / sukhibhava

మెరిసిపోయే చర్మం కోసం.. ఈ హోమ్​ మేడ్​ పేస్ట్​ ట్రై చేయండి..

అందం కోసం పార్లర్లకు వెళుతూ చాలామంది రూ.వేలు ఖర్చు చేస్తుంటారు. అయితే అంత వెచ్చించే బదులు.. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ.. సౌందర్యాన్ని పొందవచ్చు. అలాంటి ఒక చిట్కాను ఇప్పుడు తెలుసుకుందాం.

what happens when you apply papaya aloe vera on your skin
మెరిసిపోయే చర్మం కోసం.. ఈ హోమ్​ మేడ్​ పేస్ట్​ ట్రై చేయండి..
author img

By

Published : Jun 25, 2022, 5:40 PM IST

వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఎన్నో సౌందర్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. చర్మ సౌందర్యం అంటే.. పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్ లేకుండా ఉండటమని అర్థం. 'ముఖం చూసి మనసేంటో చెప్పేయొచ్చు' అనే నానుడి.. సౌందర్యానికి ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. అయితే ఆ అందాన్ని ఇంట్లోనే ఉండి.. మన గార్డెన్​లో ఉన్న.. బొప్పాయి- కలబందతో తయారు చేసిన పేస్ట్​తో పొందవచ్చు. పార్లర్లకు వెళ్లి.. రూ.వేలకు వేలు ఖర్చు చేయకుండా.. ఇంట్లోనే.. ఈజీగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. బొప్పాయి- కలబంద పేస్ట్​ తయారీ, వినియోగం, ఉపయోగాలు మీకోసం..

కావాల్సిన పదార్థాలు

  • పండిన బొప్పాయి పేస్ట్​..
  • కలబంద పేస్ట్​
  • తేనె

ముందుగా ఒక బౌల్​ తీసుకొని.. అందులో టేబుల్ స్పూన్ బొప్పాయి పేస్ట్..​ ఒక చెంచా కలబంద పేస్ట్​.. ఒక చెంచా తేనె తీసుకోవాలి. ఈ మూడింటిని కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని రాత్రిపూట ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల.. ముఖంపై పిగ్మెంటేషన్ తగ్గి.. కాంతివంగా తయారవుతుంది. అలాగే ఈ మిశ్రమాన్ని.. మహిళలు రోజుకో చెంచా తింటే.. వైట్​ డిశ్చార్జి సమస్యకు పరిష్కారంగా ఉపయోగపడుతుంది.

ఉపయోగాలు..

బొప్పాయి, అలోవెరా పేస్ట్​ వల్ల ఆయిలీ స్కిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఫేస్ ప్యాక్​లో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సూర్యుడి నుంచి వచ్చే.. యూవీ కిరణాల వల్ల చర్మం పాడవకుండా.. కాపాడుతుంది. చర్మ రంధ్రాలను హైడ్రేట్​గా ఉంచి.. చర్మం సాఫ్ట్ గా, గ్లోయింగ్​గా మారడానికి ఈ పేస్ట్​ ఉపయోగపడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి.. ముడతలు రాకుండా బొప్పాయి- కలబంద మిశ్రమం తోడ్పడుతుంది.

మెరిసిపోయే చర్మం కోసం.. ఈ హోమ్​ మేడ్​ పేస్ట్​ ట్రై చేయండి..

ఇదీ చదవండి: గుండెపోటు రాకుండా ఉండాలంటే.. రోజుకు ఎన్ని ఉల్లిపాయలు తినాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.