ETV Bharat / sukhibhava

దోమలతో నిద్రలేని రాత్రులా? - ఈ 4 మొక్కలు పెంచితే చాలు - అన్నీ ఔట్! - These Plants Are Keep Mosquitoes Away From House

These Plants Are to Keep Mosquitoes Away From House : మీ ఇంట్లో దోమల బెడద ఉందా? కాయిల్స్, లిక్విడ్స్, మస్కిటో మ్యాట్ వాడుతున్నా ఫలితం లేదా? అయితే మీరు చేయాల్సిందల్లా.. మేము చెబుతున్న ఈ నాలుగు మొక్కలను మీ ఇంట్లో పెంచడమే. ఇక.. ఒక్క దోమ కూడా మీ ఇంట్లోకి రాదంటే నమ్మండి!

These Plants Are to Keep Mosquitoes Away From House

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 12:48 PM IST

These Plants Are to Keep Mosquitoes Away From House : కాలమేదైనా జనాల్ని తీవ్రంగా వేధించే సమస్యల్లో దోమల బెడద ఒకటి. నిద్రలేకుండా చేసే ఈ దోమలు.. ఏకంగా ప్రాణాలు కూడా తీసేయగలవు! వీటిని ఇంట్లోకి రాకుండా చేసేందుకు జనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆలౌట్, కాయిల్స్, క్రీమ్స్, మస్కిటో మ్యాట్ అంటూ రకరకాల వాటిని ఉపయోగిస్తుంటారు. కానీ.. ఏదీ సరిగా వర్కవుట్ కాదు. మీరు కూడా ఇలా చేసి విసిగిపోయారా..?

అయితే.. మేము చెప్పే ఈ మొక్కలను మీ ఇంట్లో పెంచండి. దోమల దండు నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. వాటి నుంచి వచ్చే వాసన కారణంగా.. దోమలు మనల్ని గుర్తుపట్టలేవు! ఫలితంగా దగ్గరకు రాలేవు. కాబట్టి ఈ మొక్కల్ని గార్డెన్​లోనో, ఇంటి ముందరో పెంచుకుంటే.. దోమల బెడద మీ కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బంతి మొక్క
బంతి మొక్క

బంతిపూల మొక్కలు : ఈ మొక్కలు ఏడాది పొడవునా పూలు పూస్తాయి. ఈ మొక్క పువ్వులు దోమలను తరిమికొడతాయి. ఎక్కడైనా సులభంగా పెరిగే ఈ బంతి పూల మొక్కను ఆరుబయట లేదా బాల్కనీలో పెంచుకోవడం ద్వారా దోమల బెడద నుంచి ఉపశమనం పొందవచ్చు. దోమలను తరిమికొట్టడమే కాకుండా ఆ పూలను పూజకు కూడా ఉపయోగించవచ్చు.

తులసి మొక్క
తులసి మొక్క

తులసి మొక్క : ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. దోమలను కూడా తరిమికొడుతుంది. దీని నుంచి వచ్చే వాసన కారణంగా దోమలు రాకుండా ఉంటాయి. అలాగే తులసి ఆకులతో తయారుచేసిన స్ప్రే వాడినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. స్ప్రే ఎలా చేసుకోవాలంటే.. కొన్ని తులసి ఆకులను రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించండి. చల్లారిన తర్వాత ఆ వాటర్​ని స్ప్రే బాటిల్‌లో పోసి, సాయంత్రం వేళ చేతులు, మెడ, కాళ్లపై స్ప్రే చేసుకోండి. అంతే మీ చుట్టూ ఉన్న దోమలను నియంత్రిస్తుంది.

దోమలకు కొందరే ఎందుకు ఇష్టం?.. వారినే ఎందుకు టార్గెట్ చేస్తాయి?

లావెండర్ మొక్క : ఈ మొక్క నుంచి మంచి వాసన వస్తుంది. దీని పువ్వులు చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్కను అరోమాథెరపీ, మూలికా ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. లావెండర్ మొక్కలు ఈగలు, దోమలు, సాలెపురుగులు, చీమలను తిప్పికొట్టడానికి బాగా పని చేస్తాయి. అదేవిధంగా దోమ కాటు వల్ల కలిగే దురదకు ఇది హెర్బల్ రెమెడీగానూ పనిచేస్తుంది. కావాలనుకుంటే.. దీని ఆకులను తీసుకొని నేరుగా చర్మానికి పూసుకోవచ్చు. ఫలితంగా ఆకుల నుంచి విడుదలయ్యే నూనె కీటకాల నుంచి రక్షిస్తుంది. కాబట్టి ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే దోమల బెడద తగ్గుతుంది.

రోజ్​మేరీ మొక్క
రోజ్​మేరీ మొక్క

రోజ్మేరీ మెుక్క : ఇది సుగంధాలు వెదజల్లే మొక్క. ఈ మొక్క ఆకులు సూదిలా సన్నగా ఉంటాయి. దీని కాండం నుంచి వచ్చే వాసన దోమలను తరిమికొడుతుంది. రోజ్మేరీ మొక్క తెలుపు, నీలం పువ్వులను కలిగి ఉంటుంది. ఇది నూనె రూపంలో కూడా మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఆ ఆయిల్​ను మీ శరీరంపై రుద్దుకోవడం ద్వారా కూడా దోమల బెడద నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు.

దోమలకి మనిషి రక్తమే ఎందుకు?

Natural Ways To Get Rid Of Mosquitoes in Telugu : వానాకాలంలో దోమల బెడద నుంచి తప్పించుకోవాలా.. ఈ టిప్స్ ట్రై చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.