These Kitchen Items Should Not Put in Oven : ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది మైక్రోవేవ్ ఓవెన్ వాడుతున్నారు. దీని మీద తక్కువ టైమ్‌లో కొన్ని వంటలు వండుకోవచ్చు. అలాగే క్షణాల్లో ఫుడ్‌ని వేడిచేసుకోవచ్చు. ఇంతవరకు ఓకే కానీ.. మీరు మైక్రోవేవ్ ఓవెన్(Microwave)లో ఆహారపదార్థాలను కుకింగ్, వేడి చేసేటప్పుడు ఉపయోగించే కంటెయినర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో 6 వస్తువులను ఎప్పుడూ ఉంచకూడదంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ప్లాస్టిక్ కంటైనర్లు : ప్లాస్టిక్ కంటైనర్లను మైక్రోవేవ్‌లో ఉంచినప్పుడు.. ఆ వేడికి హానికరమైన రసాయనాలను విడుదల చేసే అవకాశం ఉంటుంది. "ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పెర్స్‌పెక్టివ్స్" అనే జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. కొన్ని ప్లాస్టిక్‌లు వేడికి గురైనప్పుడు ఎండోక్రైన్ వ్యవస్థకు అంతరాయం కలిగించే రసాయనాలను ఆహారంలోకి రిలీజ్ చేస్తాయి. కాబట్టి "మైక్రోవేవ్-సేఫ్" అని లేబుల్ చేసిన కంటైనర్‌లను మాత్రమే ఉపయోగించాలి.
స్టైరోఫోమ్ కంటైనర్లు : మిగిలిపోయిన ఆహారపదార్థాలను ఉంచడానికి ఈ కంటైనర్లు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. వీటిని ఎప్పుడూ మైక్రోవేవ్ ఓవెన్లో వాడకూడదు. ఎందుకంటే మైక్రోవేవ్ నుంచి వచ్చే వేడి.. స్టైరోఫోమ్ కంటైనర్లను కరిగిపోయేలా చేస్తుంది. అప్పుడు హానికరమైన రసాయనాలు ఆహారంలోకి విడుదలవుతాయి. అలాగే U.S. ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (EPA).. స్టైరోఫోమ్‌లో ఉండే స్టైరీన్‌ను మానవ క్యాన్సర్ కారకంగా గుర్తించింది. కాబట్టి వీటికి బదులుగా మైక్రోవేవ్-సురక్షిత గాజు లేదా సిరామిక్ కంటైనర్లను ఎంచుకోవడం బెటర్.
మీరు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - మీ పేగుల్లో విషం నింపుతునట్టే!
గుడ్లు : చాలా మంది త్వరగా ఉడకాలని గుడ్లను మైక్రోవేవ్ ఓపెన్‌లో పెడుతుంటారు. కానీ.. పొరపాటున కూడా ఆపని చేయొద్దు. ఎందుకంటే ఎగ్స్ మైక్రోవేవ్‌లో ఉడికించినప్పుడు దాని లోపలి టెంపరేచర్ పెరుగుతుంది. ఫలితంగా.. అది వివిధ భాగాలుగా విడిపోతుంది. తీయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాదు.. ఇందులో ఉడికిస్తే ఎగ్స్‌లో ఉండే పోషకాలు కూడా నశిస్తాయట.
హాట్ పెప్పర్స్ : వేడి మిరియాలు లేదా వాటిని కలిగి ఉన్న ఆహారాన్ని మైక్రోవేవ్‌లో పెట్టకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల రసాయనిక జరిగి.. శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. హాట్ పెప్పర్‌లను మైక్రోవేవ్ చేయొద్దంటూ "జర్నల్ ఆఫ్ ఎనలిటికల్ టాక్సికాలజీ" ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.
మెటల్, అల్యూమినియం ఫాయిల్ : అల్యూమినియం ఫాయిల్ మైక్రోవేవ్‌లో ఉంచడం వల్ల.. స్పార్క్స్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఓవెన్‌కు నష్టం జరగొచ్చు. U.S. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మైక్రోవేవ్‌లో మెటల్ ఎక్స్పోజ్డ్ అయినప్పుడు స్పార్కింగ్ ప్రమాదం జరగొచ్చని తేలింది.
మెటల్ వస్తువులు అందులో పెట్టినప్పుడు కూడా మంటలు చేలరేగడానికి ఛాన్స్ ఉంటుందట.అంతేకాకుండా.. ఆ లోహం వేడైనప్పుడు అందులోంచి హానికరమైన వాయువులు లేదా రసాయనాలు విడుదలై ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చట. కాబట్టి.. పైన పేర్కొన్న వస్తువులను వీలైనంత వరకు మైక్రోవేవ్‌లో ఉంచొద్దని నిపుణులు సూచిస్తున్నారు.