ETV Bharat / sukhibhava

దంతాలు విరిగిపోతున్నాయా? ప్రధాన కారణాలు ఇవేనట!

Teeth Breaking Reasons : శరీరంలోని అత్యంత గట్టిగా ఉండే భాగాల్లో దంతాలు ఒకటి. కానీ ఒక్కోసారి మనం చేసే కొన్ని చర్యల కారణంగా దంతాలు బలహీనంగా ఉండి విరిగిపోతుంటాయి. అయితే ఈ సమస్యకు గల ప్రధాన కారణాలు ఏంటి ? దీనిపై నిపుణుల సలహాలు, సూచనలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Teeth Breaking What Causes
Teeth Breaking What Causes
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 3:24 PM IST

Reasons for Teeth Breaking in Telugu : దంతాలు మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో ఒకటి. డెంటైన్ అనే పదార్థంతో ఇవి తయారవుతాయి. ఆహారాన్ని నమిలేందుకు, త్వరగా జీర్ణం కావడానికి దంతాలు ఎంతగానో ఉపయోపడతాయి. ఇంతటి ముఖ్యమైన పనులను నిర్వర్తించే దంతాలు కొన్ని సార్లు విరిగిపోతుంటాయి. ఇలా దంతాలు విరిగిపోవడానికి ముఖ్యంగా ఐదు కారణాలున్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దంతాలు విరిగిపోవడానికి 5 ముఖ్య కారణాలు :

నోటి పరిశుభ్రత లేకపోవడం : చాలా మంది ఉదయాన్నే పళ్లు తోముకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ, ఆరోగ్యవంతమైన దంతాలు ఉండాలంటే, రోజూ తప్పనిసరిగా రెండు సార్లు బ్రష్‌ చేయాలి. ఉదయం లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు నోటిని శుభ్రంగా క్లీన్​ చేసుకోవాలని చెబుతున్నారు. దీని వల్ల దంతాల్లో ఉండే బ్యాక్టీరియా క్లీన్‌ అయిపోయి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాయని అంటున్నారు.

పళ్లు కొరకడం (బ్రక్సిజం) : చాలా మంది నిద్రపోతున్నప్పుడు పళ్లు కొరకడం సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారిలో దవడ పళ్లు ఒకదానితో ఒకటి ఢీకొని శబ్దం వస్తుంది. ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగే వారిలో దంతాలు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. బ్రక్సిజం వల్ల దవడ నొప్పి, తలనొప్పి, మైగ్రేన్‌ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా పళ్లు కొరకడానికి ఒత్తిడి, ఆందోళన, కండరాల బలహీనతలు కారణాలని తెలిపారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా, స్పోర్ట్స్ వంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే రాత్రి నిద్రపోయేటప్పడు మౌత్‌గార్డ్‌లు, దంతాల మధ్య చిన్న ప్లాస్టిక్ చిప్స్ వంటివి పెట్టుకోవాలని చెబుతున్నారు.

వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? - మీ జుట్టు రకం ఆధారంగా ఇప్పుడే తెలుసుకోండి!

కాల్షియం, విటమిన్ డి లేకపోవడం : మన శరీరంలో కాల్షియం, విటమిన్ డి లోపిస్తే కూడా దంతాలు విరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాల్షియం అనేది పళ్లలోని ఎనామెల్‌లో ఉండే ప్రధాన పదార్థం. ఇది పళ్లను బలంగా, శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాల్షియం లోపం ఉన్నప్పుడు, పళ్లు బలహీన పడే అవకాశం ఉంది. కాబట్టి, కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పాల పదార్థాలు, చేపలు, ఆకుకూరలను రోజువారి ఆహారంలో తీసుకోవాలి. విటమిన్ డి కోసం ఉదయాన్నే కొద్దిసేపు ఎండలో ఉండాలి. అలాగే చేపలు, గుడ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రమాదాల వల్ల : కొన్ని సార్లు అనుకోని ప్రమాదాల బారిన పడినప్పుడు కూడా దంతాలు విరిగిపోతాయి. కాబట్టి, ఎక్కడికైనా వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని చెబుతున్నారు.

ఆమ్ల పదార్థాలు : అధిక ఆమ్ల గుణం ఉన్న పదార్థాలు దంతాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఇవి పళ్లను రక్షించే బయటి పొర ఎనామెల్‌కు నష్టం కలిగిస్తాయి. ఆమ్ల పదార్థాలు ఎనామెల్‌లోని ఖనిజాలను కరిగించి దంతాలను బలహీనపరుస్తాయి. దీని వల్ల పళ్లు విరిగిపోతాయి. కాబట్టి, ఆమ్ల గుణం ఉండే సిట్రస్ పండ్లు (నిమ్మకాయలు, నారింజ, ద్రాక్ష), కార్బొనేటేడ్ పానీయాలు (సోడాలు, కూల్ డ్రింక్స్), టమాట కెచప్, పండ్ల రసాలు, ఊరగాయలు, కాఫీ, టీలు తక్కువగా తీసుకోవాలి.

ఆమ్ల పదార్థాలు తిన్న తర్వాత నీటితో నోరు శుభ్రం చేసుకోవాలి. తరచుగా ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అన్ని ఆమ్ల పదార్థాలు హానికరం కాదని.. ఉదాహరణకు.. పాల పదార్థాలు, కొన్ని పండ్లలో ఆమ్లం ఉంటుంది. కానీ అవి ఆరోగ్యకరమైనవి.

బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా? అయితే ఈ లాభాలు మిస్ అయినట్లే!

కళ్లు పొడిబారుతున్నాయా? ఇలా చేస్తే హాయిగా ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.