ETV Bharat / sukhibhava

చెప్పుకోలేక.. ఆపుకోలేక ఇబ్బంది పడుతున్నారా? - etv bharat health

ఎక్కడికైనా వెళ్లాలంటే ఆందోళన. వెళ్తే ఏమవుతుందోననే భయం. ముందురోజు నుంచే తిండి మానెయ్యటం. విందులు, వినోదాలకు వెళ్లినా అరకొరగానే తినటం. ప్రయాణం మొదలైనప్పటి నుంచీ ఎప్పుడు ఇంటికి చేరుతామా అన్న ఆలోచనే. ఇలా మల విసర్జన మీద పట్టుకోల్పోయినవారు పడే వేదన అంతా ఇంతా కాదు. విసర్జన అవుతున్నట్టు అనిపించిన మరుక్షణం బాత్రూమ్‌కు పరుగెట్టాల్సిందే. తమ సమస్య గురించి ఎవరికీ చెప్పుకోలేక అనుక్షణం నరకం అనుభవించేవారు ఎందరో. అందుకే మలం ఆపుకోలేకపోవటంపై (ఫీకల్‌ ఇన్‌కాంటినెన్స్‌) సమగ్ర కథనం మీకోసం...

symptoms-and-causes-of-fecal-incontinence
చెప్పుకోలేక.. ఆపుకోలేక ఇబ్బంది పడుతున్నారా?
author img

By

Published : Oct 9, 2020, 2:11 PM IST

కొన్ని సామర్థ్యాలు మనకు తెలియకుండానే అబ్బుతాయి. మూత్ర, మల విసర్జన ఇలాంటివే. వీటిపై పట్టు చిన్నప్పట్నుంచీ క్రమంగా అలవడుతుంటుంది. విసర్జనకు వెళ్లాలని అనిపించినా బాత్రూమ్‌కు చేరుకునేంతవరకు ఆపుకోవటం దీనివల్లే సాధ్యమవుతోంది. సభ్య సమాజంలో నగుబాటుకు గురికాకుండా చూసుకోవటానికి వీలవుతోంది. అయితే కొందరిలో మల విసర్జనపై పట్టు తప్పుతుంటుంది. కొద్దిసేపైనా ఆపుకోవటం వీలుకాదు. మలం వస్తున్నట్టు అనిపించగానే బాత్రూమ్‌కు పరిగెట్టాల్సిందే. లేకపోతే బట్టల్లోనే అయిపోవచ్చు. ఇదేమీ చిన్న సమస్య కాదు. కటిభాగంలో తలెత్తే సమస్యలో తరచుగా చూస్తున్నదే. మన జనాభాలో సుమారు 2% మంది మలం లీకయ్యే సమస్యతో బాధపడుతున్నారని అంచనా. అయితే వీరిలో కేవలం 10% మందే చికిత్సల కోసం డాక్టర్లను సంప్రదిస్తున్నారు. చాలామంది సమస్యను తమలోనే దాచుకొని, మౌనంగా బాధపడిపోతున్నారు. సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు చెప్పుకోవటానికి కూడా జంకుతుంటారు. వివిధ సంప్రదాయాలు, కట్టుబాట్లు, సంస్కృతులకు నిలయమైన మనదేశంలో ఇలాంటి ధోరణి మరింత ఎక్కువ.

ఇది ఇబ్బందికరమైన సమస్య మాత్రమే కాదు.. మానసికంగానూ బాగా కుంగదీస్తుంది. దీని మూలంగా పదేళ్ల నుంచీ బయటకు వెళ్లటం లేదని చెబుతున్నవారూ లేకపోలేదు. చాలామంది ప్యాడ్లు వంటివి వేసుకుంటూ ఏదో ఒకరకంగా నెట్టుకు రావటానికే ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ డాక్టర్‌ దగ్గరకు వచ్చినా నేరుగా సమస్య గురించి ప్రస్తావించటానికీ జంకుతుంటారు. 'మోషన్‌లో కొద్దిగా ప్రాబ్లమ్‌ ఉంది' అని మొదలెడతారు. నొప్పి ఉందా? చీము, రక్తం పడుతున్నాయా? అంటే లేదంటారు. మరేంటని అడిగితే 'అప్పుడప్పుడు లీకవుతోంది' అని అసలు విషయం చెబుతారు. ప్రజలకే కాదు, చాలామంది డాక్టర్లకూ దీనిపై సరైన అవగాహన ఉండటం లేదు. అయితే ఇదీ ఒక సమస్యేనని, దీని గురించి చెప్పుకోవటానికి బిడియం, సిగ్గు అవసరం లేదని గుర్తించటం అవసరం. దీనికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. జీవనశైలి మార్పులు, మందులతోనే చాలావరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు కూడా.

కారణాలు అనేకం

మలం లీక్‌ కావటం ఎవరికైనా రావొచ్చు. కాకపోతే వృద్ధుల్లో, మహిళల్లో ఎక్కువగా కనబడుతుంది. వయసు మీద పడుతున్నకొద్దీ కండరాలు సహజంగానే క్షీణిస్తుంటాయి. ఈ క్రమంలో మలాన్ని పట్టి ఉంచటానికి తోడ్పడే కండరాలూ బలహీనం కావొచ్చు. ఇది చివరికి సమస్యాత్మకంగానూ పరిణమిస్తుంది. ఇతరత్రా అంశాలు కూడా దీనికి దోహదం చేయొచ్చు.

కండరం దెబ్బతినటం

మలద్వారంలోని కండర వలయాలు దెబ్బతినటం, చీరుకుపోవటం వల్ల అవి పూర్తిగా మూసుకుపోవు. దీంతో కడుపులోని కండరాలపై, మలాశయంలో ఏమాత్రం ఒత్తిడి పెరిగినా మలం లీక్‌ అవ్వొచ్చు. స్త్రీలలో కాన్పు జరిగేటప్పుడు- ముఖ్యంగా సహజ కాన్పులో కండర వలయం చిరిగే అవకాశం ఎక్కువ. ఇది తిరిగి సరిగా అతుక్కోకపోతే మలాన్ని పట్టి ఉంచే సామర్థ్యం తగ్గిపోతుంది. అయితే కాన్పు జరిగిన వెంటనే సమస్య మొదలవుతుందని అనుకోవాల్సిన పనిలేదు. చాలా ఏళ్ల తర్వాత నెమ్మదిగానూ బయటపడొచ్చు.

నాడి దెబ్బతినటం

రెక్టమ్‌, కండర వలయాలకు సంకేతాలు అందించే నాడులు దెబ్బతినటం మరో కారణం. కాన్పు జరగటానికి మరీ ఎక్కువ సమయం పట్టటం వల్ల ప్యుడెండల్‌ నాడి బాగా సాగిపోయి, దెబ్బతినే అవకాశముంది. వెన్నెముక దెబ్బలు, పక్షవాతం, మధుమేహం వంటివీ నాడులను దెబ్బతీయొచ్చు.

మలబద్ధకం

చాలాకాలంగా మలబద్ధకంతో బాధపడేవారిలో పెద్దపేగు, రెక్టమ్‌ గోడలు బాగా సాగిపోతుంటాయి. దీంతో ఇవి క్రమంగా బలహీనపడి మలం ఊటలాగా జారటానికి దారితీస్తుంది. మలబద్ధకం మూలంగా నాడులు దెబ్బతినొచ్చు కూడా. కొందరిలో నీళ్ల విరేచనాలతోనూ సమస్య మరింత ఉద్ధృతమవుతుంటుంది.

సర్జరీలు

మల శస్త్రచికిత్స చేసే సమయంలో కొందరిలో కండర వలయం దెబ్బతినొచ్చు. ఇది మలం లీక్‌ కావటానికి దారితీయొచ్చు. మలద్వారానికి క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయించుకున్నవారిలో కండరాలు, నాడులు దెబ్బతినటం కూడా సమస్యను తెచ్చిపెట్టొచ్చు.

డిమెన్షియా

దీని బారినపడ్డవారు మలాశయం నిండిందో లేదో గుర్తించలేకపోతారు. బాత్రూమ్‌కు వెళ్లటమూ మరిచిపోతుంటారు. దీంతో మలాశయం సాగుతూ సాగుతూ చివరికి ఒక స్థాయిలో పట్టు తప్పిపోతుంది (ఓవర్‌ఫ్లో ఇన్‌కాంటినెన్స్‌). ముఖ్యంగా వృద్ధుల్లో ఇలాంటిది ఎక్కువగా కనబడుతుంది. దీనికి చికిత్స కూడా వేరేగా చేయాల్సి ఉంటుంది. వీరికి రోజూ ఎనీమా ఇవ్వటం ద్వారా ఒకేసారి విసర్జన అయ్యి, మలాశయం ఖాళీ అవుతుంది. దీంతో బాత్రూమ్‌కు వెళ్లటం మరచిపోయినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు

నిర్ధరణ

లక్షణాల ఆధారంగానే చాలావరకు సమస్యను అనుమానిస్తారు. మలం, ఊట, గ్యాస్‌ లీక్‌ అవుతున్న తీరును బట్టి తీవ్రతను అంచనా వేస్తారు. అవసరమైతే మలద్వార, మలాశయ స్కాన్‌ చేస్తారు. కండర వలయం ఎక్కడైనా దెబ్బతింటే ఇందులో బయటపడుతుంది. యానోరెక్టల్‌ మానోమెట్రీ ద్వారా మలద్వారంలో పీడనాన్ని గుర్తించి, విసర్జనపై పట్టు ఎంతవరకుందో గుర్తిస్తారు.

ఏంటీ సమస్య?

మల విసర్జన చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. పెద్దపేగు కండరాలు, కండర వలయాలు, నాడులు ఇలాంటివన్నీ ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. మనం తిన్న ఆహారం జీర్ణమై, మిగిలిన వ్యర్థ పదార్థం మలం రూపంలో బయటకు వస్తుంది. ఇది ఎప్పటికప్పుడు పెద్దపేగుల చివరన ఉండే పురీషనాళంలోకి (రెక్టమ్‌) వచ్చి చేరుతుంటుంది. ఒకరకంగా ఇది మలం నిల్వ ఉండే ప్రాంతమని అనుకోవచ్చు. మలం నిండినకొద్దీ ఇందులో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో రెక్టమ్‌ గోడలకు గల గ్రాహకాలు స్పందించి, కటిభాగంలోని కండరాలకు సంకేతాలు అందించే ప్యుడెండల్‌ నాడి ద్వారా మెదడుకు ఆ సమాచారాన్ని చేరవేస్తాయి. దీంతో మనకు విసర్జనకు వెళ్లాలని అనిపిస్తుంది. రెక్టమ్‌కు దిగువన తాడు లాగా చుట్టుకొని ఉండే ప్యూబోరెక్టాలిస్‌ కండరం.. మలద్వారంలో కాస్త పైవైపున, కింది వైపున ఉండే రెండు దృఢమైన కండర వలయాలు (స్ఫింక్టర్స్‌) కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తాయి. ప్యూబోరెక్టాలిస్‌ కండరం స్ఫింక్టర్స్‌తో కలిసి పనిచేస్తుంది. మామూలు సమయాల్లో కాస్త వంగిపోయి రెక్టమ్‌ను బిగుతుగా పట్టుకొని ఉండే ఇది విసర్జనకు కూచున్నప్పుడు వదులై మలం కిందికి వచ్చేలా చేస్తుంది. ఈ కండరాలు, నాడుల్లో ఏవి దెబ్బతిన్నా విసర్జనపై పట్టు తప్పి, మలం లీక్‌ కావటానికి దారితీయొచ్చు.

చికిత్స- జీవనశైలి ప్రధానం

కొందరికి గట్టి మలం ఆగదు, ఇంకొందరికి పలుచటి మలం ఆగదు. మరికొందరికి గ్యాస్‌ లీక్‌ అవుతుంటుంది. కండరం చిరిగినా కొందరికి పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. మామూలుగానే పనులు చేసుకుంటుండొచ్చు. ఇలాంటివారిలో చాలామంది గట్టిగా ఉండే మలాన్ని బాగానే నిలపగలుగుతారు. కానీ నీళ్లతో కూడిన మలాన్ని పట్టి ఉంచలేరు. వీరికి ముందుగా జీవనశైలి మార్పులనే సూచిస్తారు. ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం బాగా ఉపయోగపడుతుంది. ఇది వ్యర్థ పదార్థం ఒకదగ్గర ముద్దగా ఏర్పడటానికి తోడ్పడుతుంది. అవసరమైతే నీళ్ల విరేచనాలు తగ్గటానికి ఇచ్చే లోప్రమైడ్‌ వంటి మందులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

అలాగే కటి కండరాలను బలోపేతం చేసే కీగెల్‌ వ్యాయామాలు కూడా మేలు చేస్తాయి. ఇవి మూత్రం లీక్‌ కాకుండానే కాదు, విసర్జన మీద పట్టుకోల్పోకుండానూ తోడ్పడతాయి. చాలావరకు వీటితోనే మంచి ఫలితం కనబడుతుంది. వీలైనంతవరకు సమస్య నియంత్రణలో ఉంటుంది. వీటితో అంతగా ఫలితం కనబడకపోయినా, సమస్య మరింత తీవ్రమవుతున్నట్టు అనిపించినా బయోఫీడ్‌బ్యాక్‌, స్టిమ్యులేటర్‌తో సాక్రల్‌ నాడులను ప్రేరేపించటం, మలద్వారం కండరాలు గట్టిపడేలా చేసే రేడియో ఫ్రీక్వెన్సీ, కండర వలయం గట్టిగా బిగుసుకునేలా చేయటానికి కర్బన పదార్థాలు, కొవ్వు కణాలతో కూడిన ద్రవాన్ని సూది ద్వారా మలద్వారం లోకి ఎక్కించటం వంటి చికిత్సలు చేయాల్సి వస్తుంది.

సర్జరీ

కండర వలయం దెబ్బతింటే సర్జరీ చేసి సరిచేయాల్సి ఉంటుంది. ఇందులో దెబ్బతిన్న లేదా బలహీనపడిన కండరాన్ని గుర్తించి చుట్టుపక్కల కణజాలం నుంచి దాన్ని వేరుచేస్తారు. తర్వాత కండరం అంచులు ఒకదానిపై మరోటి పడేలా దగ్గరికి చేర్చి కుడతారు. ఒకవేళ తగినంత కండరం అక్కడ లేకపోతే తొడల దగ్గర్నుంచి గ్రెసిలెస్‌ కండరాన్ని తీసుకొచ్చి కుడతారు. ఇది కండర వలయం పూర్తిగా, గట్టిగా బిగుసుకుపోవటానికి తోడ్పడుతుంది. దీంతో 80-85 శాతం వరకు ఫలితం కనబడుతుంది.

ఇదీ చదవండి: ఆ మంటతో తంటాలుపడక ముందే జాగ్రత్తపడదాం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.