ETV Bharat / sukhibhava

వ్యాయామం చేయడానికి వీలుండట్లేదా.. నిల్చున్నా చాలు! - నిల్చోవడం వల్ల లాభాలు

నిల్చోవటం వల్ల కణాల్లో ఇన్సులిన్‌ను గ్రహించుకునే స్వభావం మెరుగవుతున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. అందువల్ల ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం కన్నా అప్పుడప్పుడు నిల్చోవటం మేలని.. తగినంత వ్యాయామం చేయలేనివారికిది మరింత ముఖ్యమని పరిశోధకులు సూచిస్తున్నారు.

increase of insulin
వ్యాయామం చేయడానికి వీలు పడటం లేదా
author img

By

Published : Oct 22, 2021, 4:41 PM IST

మధుమేహం, గుండెజబ్బుల వంటి జీవనశైలి జబ్బులను నివారించుకోవాలని అనుకుంటున్నారా? తగినంత వ్యాయామం చేయటానికి వీలు పడటం లేదని విచారిస్తున్నారా? కనీసం రోజులో నిల్చునే సమయాన్ని అయినా పెంచుకోండి. నిల్చోవటం వల్ల కణాల్లో ఇన్సులిన్‌ను గ్రహించుకునే స్వభావం మెరుగవుతున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. మనం తీసుకునే ఆహారం శక్తిగా మారటంలో, రక్తంలో గ్లూకోజు మోతాదుల నియంత్రణలో ఇన్సులిన్‌ హార్మోన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అధిక బరువుతో దీని పనితీరు అస్తవ్యస్తం కావొచ్చు. ఇది ఇన్సులిన్‌ను గ్రహించుకునే సామర్థ్యం తగ్గేలా చేయొచ్చు. ఫలితంగా మధుమేహం, గుండెజబ్బుల ముప్పు పెరుగుతుంది. వీటి నివారణకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఎంతగానో తోడ్పడుతుంది.

అయితే ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం, కూర్చున్నప్పుడు మధ్యమధ్యలో లేవటం, నిల్చోవటం వంటి వాటి ప్రభావాల గురించి అంతగా తెలియదు. ఈ నేపథ్యంలో ఫిన్‌లాండ్‌లోని తుర్కు పెట్‌ సెంటర్‌, యూకేకే ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు వీటిపై అధ్యయనం చేశారు. వ్యాయామం లేదా కూర్చునే సమయం, శరీర సామర్థ్యం, అధిక బరువు వంటి వాటితో నిమిత్తం లేకుండానే నిల్చోవటం మూలంగా ఇన్సులిన్‌ గ్రాహక సామర్థ్యం ఇనుమడిస్తున్నట్టు గుర్తించారు. అందువల్ల ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం కన్నా అప్పుడప్పుడు నిల్చోవటం మేలని.. తగినంత వ్యాయామం చేయలేనివారికిది మరింత ముఖ్యమని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి : మధుమేహానికి రక్తపోటు తోడైతే గుండెకు ప్రమాదమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.