ETV Bharat / sukhibhava

Speed Walking Benefits : వేగంగా నడిస్తే ఇన్ని లాభాలా..! గుండె, క్యాన్సర్​, బీపీ రోగాలకు చెక్​!

Speed Walking Benefits : ఈ ఆధునిక కాలంలో నడక లేదా వాకింగ్​ను అనేక మంది చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. వాహనాల శాతం పెరగడమే కాకుండా మారిన జీవన శైలి దీనికి ప్రధాన కారణాలు. ఉదయమైనా, సాయంత్రమైనా రోజూ నడిచే వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది. కానీ నడవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని డాక్టర్లు సూచిస్తున్నారు. అవేంటంటే..

Benefits Of Walking Fast
వేగంగా న‌డ‌వ‌టం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలెన్నో..!
author img

By

Published : Jun 14, 2023, 10:20 AM IST

Speed Walking Benefits : చాలా మందికి నడక లేదా వాకింగ్​కు ఉన్న ప్రాధాన్యం గురించి తెలియదు. ముఖ్యంగా ఈ తరం వారికి. వాహనాల వినియోగం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వంటి అంశాలు రోజూ నడిచే వారి సంఖ్యను తగ్గిస్తోంది. కానీ రోజూ నడవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు వైద్యులు.

Benefits Of Walking Fast : వాకింగ్.. ఏరోబిక్స్, వ్యాయామాలకు పునాది వేస్తుంది. గుండెకు అందే రక్త ప్రసరణను మెరుగుపరచి తగిన ఆక్సిజన్​ను అందించడంలో తోడ్పడుతుంది. బరువును అదుపులో ఉంచడమే కాకుండా మంచి నిద్రకు సాయపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో నడక కీలక పాత్ర పోషిస్తోంది. రోజూ కనీసం 30 నిమిషాలైనా నడవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే వాకింగ్​ అనేది సాధారణంగా నడవాలా.. లేదా వేగంగా నడిస్తే మంచిదా అనే సందేహాలు కొందరిలో ఉంటుంది. ఈ క్రమంలో మాములు నడక కన్నా వేగంగా నడవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్​ వంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల ముప్పు నుంచి రక్షించుకోవచ్చని ఒక పరిశోధనలో వెల్లడైంది. మరి వేగంగా నడవటం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలెంటో తెలుసుకోండి..

హృదయ సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది!
Walking Benefits : వేగంగా న‌డ‌వ‌టం వ‌ల్ల ఏరోబిక్ ఆక్టివిటీ పెర‌గ‌డమే కాకుండా గుండె సంబంధిత దృఢత్వాన్ని మెరుగు పరుస్తుంది. రోజూ 10 వేల అడుగులు న‌డ‌వ‌టం వ‌ల్ల గుండె సంబంధిత అకాల మ‌ర‌ణాల ముప్పు నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. బీపీ, కొలెస్ట్రాల్ సైతం నియంత్ర‌ణ‌లో ఉంటాయి. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

న‌రాల ప‌నితీరుపై అనుకూల ప్ర‌భావం!
Walking Benefits Mental Health : వేగంగా న‌డ‌వ‌టం మన మెద‌డు ప‌నితీరుపై అనుకూల ప్ర‌భావాన్ని చూపుతుంది. ఇది మూడ్‌ స్వింగ్స్​, జ్ఞాప‌క‌శ‌క్తి, నిద్ర‌కు మేలు చేస్తుంది. సాధార‌ణంగా గుండె, ర‌క్త నాళాల‌పై తీవ్రమైన ఒత్తిడి క‌లిగిన‌ప్పుడు స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాద‌ముంది. వేగంగా న‌డ‌వ‌డం వ‌ల్ల మెద‌డుకు ర‌క్తాన్ని పంప్ చేసే న‌రాల ప‌నితీరు మెరుగ‌వుతుంది. ఫ‌లితంగా ఒత్తిడి, అల‌స‌ట‌లు త‌గ్గుతాయి.

కండ‌రాలను పటిష్ఠం చేస్తుంది!
Walking Benefits For Health : స్పీడ్ వాకింగ్ కండ‌రాల బ‌లాన్ని పెంచ‌డంలో ఎంతో సహాయ‌ప‌డుతుంది. ముఖ్యంగా శ‌రీర దిగువ భాగంలో కండ‌రాలు బ‌లంగా త‌యార‌వుతాయి. మెరుగైన శరీర ఆరోగ్యానికి స్పీడ్ వాక్ మంచిద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అది బ‌య‌ట అయినా సరే, త్రెడ్​మిల్​పై అయినా స‌రే. అలా న‌డిచిన కొన్ని రోజుల త‌ర్వాత ఫ్లెక్సిబిలిటీ, ఓర్పును మీలో మీరే గ‌మ‌నిస్తారు. బాడీని షేప్ చేయ‌డమే కాకుండా కొవ్వును క‌రిగించ‌డంలోనూ స్పీడ్ వాక్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

క్యాల‌రీలు క‌రిగిస్తుంది!
Speed Walking Calories : వేగంగా న‌డిచే అల‌వాటు ఉన్న‌వాళ్ల‌కి బ‌రువు అదుపులో ఉంటుంది. మ‌న శ‌రీరానికి కావాల్సిన క్యాల‌రీల క‌న్నా ఎక్కువ తీసుకున్న‌ప్పుడు బ‌రువు పెరిగే అవ‌కాశ‌ముంటుంది. మ‌రి ఆ క్యాల‌రీలను క‌రిగించ‌డానికి ఉన్న అనేక మార్గాల్లో న‌డ‌క ఒక‌టి. కాబ‌ట్టి వేగంగా న‌డ‌వ‌టం వ‌ల్ల అవి అధికంగా ఖ‌ర్చ‌వుతాయి. వేగంగా న‌డిచిన‌ప్ప‌డు గుండెకు వేగంగా ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌రిగి ఆరోగ్యంగా ఉంటామ‌ని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మొత్తంగా ఎటువంటి కష్టం లేకుండా ఉండే వాకింగ్​ వల్ల ఇన్ని ఆరోగ్య లాభాలున్నాయని తెలుసుకున్నారు కదూ. అయితే ఇంకెందుకు ఆలస్యం.. రేపే మొదలుపెట్టేయండి మరి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.