Remedies For Knee Pain: అధిక బరువు మధుమేహం తేవడమే కాదు.. మోకాళ్ల నొప్పి కూడా తెస్తోంది. బరువు పెరిగిన కొద్దీ మోకీళ్లలోని గుజ్జు క్రమంగా అరిగిపోతుంది. కూర్చున్న తర్వాత నిలబడాలంటే కన్నీళ్లు తెప్పిస్తుంది. ఏ పని చేయాలన్నా.. ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వయసు పెరిగే కొద్దీ నొప్పులు అధికం అవుతాయి. ఈ సమస్యకున్న పరిష్కార మార్గాలను సీనియర్ నిపుణులు వివరించారు.
బరువు పెరిగితే ముందే ఇబ్బందులు..
వయసుతో పాటే మోకాళ్ల నొప్పులు వస్తాయి. అదే బరువు అధికంగా ఉంటే 10 ఏళ్ల ముందే నొప్పి వస్తుంది. ఒకసారి మోకాళ్లలో నొప్పి మొదలయిన తర్వాత దాన్ని నివారించాలంటే బరువు తగ్గించుకోవాల్సిందే. మనం చేసే పనుల ఆధారంగా ఈ సమస్య తీవ్రత ఉంటుంది. కొంతమందికి బరువైన పనులు చేసినపుడు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఎక్కవ సమయం కూర్చున్నా ఇబ్బందులు వస్తాయి. రోజూ వ్యాయామం, నడక, సమతుల ఆహారంతోనే సమస్యను తగ్గించుకోవడం వీలవుతుంది.
ఇలా చేస్తే బాగుంటుంది
- బరువులు ఎత్తకుండా నడవడం మంచిదే.
- యోగా, సైక్లింగ్ చేస్తే ఇబ్బందులుండవు. మెట్లు ఎక్కడం తగ్గించాలి.
- బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే మోకాళ్ల నొప్పి చాలా వరకు తగ్గించుకోవచ్చు.
- ఆహారంలో వేపుడు పదార్థాలు తగ్గించుకోవాలి. కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
ఇదీ చదవండి: గుండెజబ్బు ఉన్నవారికి స్టాటిన్ చికిత్స మధ్యలో ఆపేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ప్రొటీన్‌తో మధుమేహానికి చెక్.. రోజుకు ఎన్ని గ్రాములు తీసుకోవాలంటే?