Refrigerator Safety Tips in Telugu : సీజన్‌తో సంబంధం లేకుండా.. ఏడాది మొత్తం ఉపయోగంలో ఉండే వస్తువు ఫ్రిజ్. ఇది ఎన్ని అవసరాలు తీరుస్తుందో జనాలకు తెలుసుగానీ.. దీని అవసరాలేంటో మాత్రం కొద్ది మందికే తెలుసు. అందుకే.. ఫ్రిజ్ నిర్వహణకు సంబంధించిన జాగ్రత్తలన్నీ తెలుసుకోవాలి. తప్పక పాటించాలి. లేదంటే రిఫ్రిజిరేటర్(Refrigerator) బాంబులా పేలి ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉంది. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఫ్రిజ్‌లో ప్రధానంగా పేలుడు దాని కంప్రెషర్ వల్ల సంభవిస్తుంది. యూనిట్ వెనుక భాగంలో ఈ కంప్రెసర్ ఉంటుంది. ఇది పంప్, మోటారును కలిగి ఉండి.. కాయిల్ ద్వారా కూలింగ్ వాయువును నెట్టేస్తుంది. ఆ వాయువే ద్రవంగా మారి.. వేడిని గ్రహించి వస్తువులను కూల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
- రిఫ్రిజిరేటర్ వెనుక భాగం కొన్నిసార్లు చాలా వేడెక్కుతుంది. దాంతో కండెన్సర్ కాయిల్ కుంచించుకుపోవడం స్టార్ట్ అవుతుంది. ఫలితంగా.. కంప్రెసర్ కాయిల్లో ఎక్కువ వాయువు పేరుకుపోయి.. ఒత్తిడి పెరిగి భారీ పేలుడుకు కారణమవుతుంది.
- 8 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న రిఫ్రిజిరేటర్లలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా ఉండడానికి కంప్రెసర్ కాయిల్ మూసుకోకుండా శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
- అదేవిధంగా.. ఎలక్ట్రికల్ వైరింగ్‌లో లోపం, పవర్ ప్లగ్, పవర్ సప్లై కార్డ్‌లో లోపం, ఫ్యాన్ మోటార్ లేదా కంప్రెసర్ ఫ్యాన్‌లో ప్రాబ్లమ్, ఫ్రీజర్ కెపాసిటర్‌లో లోపాలు తలెత్తినా ఫ్రిజ్ పేలే ఛాన్సా ఉంది. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫీషియంట్ రెసిస్టర్లో.. డీఫ్రాస్ట్ టైమర్‌లో.. లోపాల వల్ల కూడా పేలుడు సంభవించే అవకాశం ఉంది.
- అందువల్ల.. మీరు ఫ్రిజ్‌లో ఏదైనా సమస్యను గమనించినట్లయితే.. వెంటనే టెక్నిషీయన్ పిలిపించి చెక్ చేయించాలి. ఒకవేళ సమస్య తీవ్రంగా అనిపిస్తే వెంటనే దాని స్విచ్ ఆఫ్ చేసి అన్‌ప్లగ్ చేయాలి.
- విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు అనిపించినప్పుడు కూడా ఫ్రిజ్‌ను అన్‌ప్లగ్ చేయాలనే విషయం మర్చిపోవద్దు.
ఫ్రిడ్జ్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయా? ఇలా చెక్ పెట్టండి!
- రిఫ్రిజిరేటర్‌ను ఎప్పుడూ విద్యుత్తు హెచ్చుతగ్గులు ఉన్న ప్రదేశంలో వాడొద్దు. దీనివల్ల కంప్రెసర్ పై ఒత్తిడి పెరిగి పేలుడు సంభవించవచ్చు.
- కొన్ని సందర్భాల్లో మీ రిఫ్రిజిరేటర్లో కూలింగ్ ఎక్కువై మంచు గడ్డకట్టుకుపోతుంది. ఇలా చాలా సార్లు జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో ఎక్కువ సార్లు ఫ్రిజ్ తెరవాలి. లేదంటే మంచు ఫ్రిజ్ నిండా పేరుకుపోయి.. కంప్రెషర్‌పై భారం పడి పేలుడు జరిగే ప్రమాదం ఉంటుంది.
- రిఫ్రిజిరేటర్లో కంప్రెసర్ భాగంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే.. దానిని కంపెనీ సర్వీస్ సెంటర్ వద్దకే తీసుకెళ్లాలి.
- ఎందుకంటే.. అక్కడికి వెళ్లడం ద్వారా వారు ఒరిజినల్ పార్ట్స్ బిగించి సమస్యను పరిష్కరిస్తారు. లేదంటే మీరు స్థానికంగా దొరికే రిపేర్ షాప్స్‌లో స్పేర్ భాగాలను ఉపయోగిస్తే.. అవి పేలుడుకు దారి తీసే అవకాశాలు లేకపోలేదు.
- రిఫ్రిజిరేటర్ నిరంతరంగా నడుస్తుంటే.. డోర్ ఓపెన్ చేయడానికి ముందు పవర్ ఆఫ్ చేసి, కాసేపటి తర్వాత ఆన్ చేయాలి. అలా చేయడం ద్వారా పేలుడు నుంచి బయటపడవచ్చు.
- ఫ్రిజ్ ఉష్ణోగ్రతను ఎప్పుడు కూడా కనిష్ట స్థాయికి తగ్గించకూడదు. దీని కారణంగా రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ అవసరమైన దానికంటే ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దాంతో అది చాలా వేడిగా మారి పేలిపోయే అవకాశం ఉంది.
How to Stop Bad Smell From Fridge : ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుందా?.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!