ETV Bharat / sukhibhava

రెడ్ రైస్ గురించి మీకు తెలుసా? - అంత మంచిదా?

Red Rice Benefits for Health : మనం ఆరోగ్యంగా ఉండాలంటే బాడీకి రోజూ పోషకాహారం అందించడం చాలా అవసరం. ఇందుకోసం మనందరం సాధారణంగా డైలీ తెల్లటి బియ్యాన్ని అన్నంగా తీసుకుంటుంటాం. అయితే ఇటీవల కాలంలో బ్రౌన్, రెడ్ రైస్ అనే రెండు రకాల బియ్యం పేరు వింటున్నాం. ఇంతకీ ఏ రైస్ ఆరోగ్యానికి మంచిది? పోషకాలు దేనిలో ఎక్కువ? అనేది ఇప్పుడు చూద్దాం..

Red Rice Benefits for Health
Which Rice Better for Good Health
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 9:47 AM IST

Different Types of Rice Health Benefits : బియ్యం అనగానే మనందరికీ తెలిసింది తెల్ల రంగులో ఉండేవి మాత్రమే. బ్రౌన్ రైస్ ఈ మధ్యనే ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ.. ఇవి రెండూ కాకుండా రెడ్ రైస్ కూడా ఉన్నాయి. మరి.. ఈ రెడ్ రైస్ ప్రత్యేకత ఏంటి..? వైట్​, బ్రౌన్(Brown Rice) కన్నా ఇవి మేలైనవా? ఏ విధమైన ప్రయోజనాలు పొందవచ్చు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వైట్ రైస్ : రైస్ మిల్లులో వడ్లు బియ్యంగా మారుస్తున్నప్పుడు పాలిష్ చేస్తారు. అందుకే బియ్యం తెల్లగా వస్తాయి. ప్రాసెసింగ్ వల్ల పోషకాలు కాస్త తగ్గుతాయి. కానీ.. శక్తి మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఇందులో అధిక కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ రైస్ వెంటనే ఎనర్జీ అందిస్తాయి. ప్రాసెసింగ్ టైమ్​లో ఈ బియ్యాన్ని ఎక్కువ పాలిష్ చేయడం వల్ల ఫైటిక్ యాసిడ్​తోపాటు థయామిన్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. థయామిన్​నే విటమిన్ B1 అంటారు. ఇందులోని అదనపు క్యాలరీస్ వల్ల శారీరక శ్రమ చేయని వారిలో.. ఊబకాయం, మధుమేహం వంటివి వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బ్రౌన్ రైస్ : ధాన్యం నుంచి పొట్టును వేరు చేసిన తర్వాత ఉండే బియ్యాన్నే బ్రౌన్ రైస్ అంటారు. వీటిని పాలిష్ చేయరు. దీంతో బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. అందుకే అలా పిలుస్తారు. ఈ రైస్ తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రాసెస్ చేయరు కాబట్టి.. న్యూట్రియంట్స్ ఇందులో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇక బ్రౌన్ రైస్‌లో మెగ్నీషియం(43 mg) నిండి ఉంటుంది. ఇది మైగ్రేన్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట.

గోరువెచ్చని నీరు తాగే అలవాటుందా? లేదా? - అయితే తప్పకుండా చదవండి!

రెడ్ రైస్ : ఈ బియ్యంలో ఆంథోసయనిన్ అనే యాంటీఆక్సిడెంట్ కాంపౌండ్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఎరుపు రంగులో కనిపిస్తాయి. అయితే ఈ ఆంథోసయనిన్ అనేది ముదురు ఊదా, ఎరుపు రంగు కూరగాయలు, పండ్లలో కూడా కనిపిస్తుంది. ఈ సమ్మేళనం వాపు, అలెర్జీలను తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాలను నివారిస్తుందని, బరువు మెయింటేయిన్ చేయడంలోనూ ఎంతో సహాయపడుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ రైస్​ను కూడా బ్రౌన్ రైస్ లాగే పాలిష్ చేయరు కాబట్టి రెడ్ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. పీచు శాతమూ ఎక్కువగానే ఉంటుంది.

అందువల్ల.. వైట్ కన్నా.. బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఆరోగ్యకరమైనవని నిపుణులు అంటున్నారు. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకలు, దంతాలను హెల్దీగా ఉంచడానికి ఎంతో సహాయపడుతాయి. ఆర్థరైటిస్ ప్రమాదాన్ని కూడా నివారిస్తాయి. బ్రౌన్, రెడ్ రెండింటిలోనూ సెలీనియం ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఫైబర్ అధికంగా ఉన్నందున జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిగా ఉంటుంది. తద్వారా జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇవి రెండూ గ్లైసెమిక్ లోడ్‌లో తక్కువగా ఉన్నందున.. పిండి పదార్థాలు రక్తంలో చక్కెరగా మారే రేటును తగ్గించడంలో సహాయపడతాయి.

స్థూలంగా చూసుకుంటే.. బ్రౌన్, రెడ్ రైస్ రెండూ ఒకే విధమైన పోషకాలను కలిగి ఉంటాయి. రెడ్ రైస్​లో కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎర్ర బియ్యం సాధారణంగా దక్షిణ టిబెట్, భూటాన్, హిమాలయ పర్వతాల వద్ద ఎక్కువగా కనిపిస్తుంది. అదే బ్రౌన్ రైస్ ప్రపంచవ్యాప్తంగా సులభంగా దొరుకుతుంది.

దంపుడు బియ్యం వల్ల లాభాలెన్నో తెలుసా?.. మధుమేహం, బీపీకి చెక్​!

వండిన వాటి కంటే పచ్చి ఆహారం మేలైనదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.