ETV Bharat / sukhibhava

ప్రతీ వారం మటన్ తింటే - షుగర్ వస్తుందా?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 11:35 AM IST

Mutton Side Effects: మీరు మాంసం ప్రియులా? మటన్ కాస్త ఎక్కువగానే లాగిస్తుంటారా? అయితే.. పలు ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు!

Mutton Side Effects in Telugu
Mutton Side Effects in Telugu

Mutton Side Effects in Telugu: చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. కొంత మంది వారానికి ఒకసారి తింటే.. మరికొందరు వారానికి మూడునాలుగు రోజులు లాగిస్తుంటారు. నాన్​వెజ్​ అంటే ముందుగా అందరికీ చికెన్​ గుర్తుకువస్తుంది. ఆ తర్వాతి స్థానంలో మటన్​ మస్ట్​గా ఉంటుంది. వాస్తవానికి ఇవి రెండూ ఆరోగ్యానికి అవసరమే. ఎందుకంటే.. మాంసాహారం తినడం వల్ల శరీరానికి ప్రొటీన్స్​ లభిస్తాయి. వీటిలోని పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. మాంసం పరిమితంగా తినడం వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి. కానీ అతిగా తింటే మాత్రం చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నాన్​ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం వ్యాధుల నిలయంగా మారుతుందని అంటున్నారు. మాంసాహారం తీసుకోవడం వల్ల గుండె సంబంధింత వ్యాధులతోపాటు షుగర్​ కూడా ఎటాక్​ అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

చలికాలంలో కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా? ఈ నేచురల్​ ప్యాక్స్​తో కోమలంగా మారిపోతాయి!

మటన్​ ఎక్కువగా తినడం వల్ల నష్టాలు:

గుండెపోటు వచ్చే ప్రమాదం: మటన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెకు ప్రమాదం కలుగుతుంది. మటన్‌లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది LDL (చెడు కొలెస్ట్రాల్) ను పెంచుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయులు గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాకుండా హానికరమైన కొలెస్ట్రాల్ ధమనులలో పేరుకుపోయి.. రక్త ప్రసరణకు అడ్డంకులు కలిగిస్తుంది. ఫలితంగా.. రక్త సరఫరా తగ్గి గుండెకు సరిపడా ఆక్సిజన్ అందదు. అందుకే.. మాంసం అతిగా తినేవారికి గుండెపోటు, పక్షవాతం లేదా ఇతర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మటన్‌ను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.

షుగర్ ఉన్నవారు చికెన్, మటన్ తినకూడదా? ఏం తింటే బెటర్​?

టైప్ 2 డయాబెటిస్ : ఎక్కువ మాంసం తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్‌ మాంసంలో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మాంసం ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో ఇన్సులిన్ స్థాయి తగ్గి.. క్రమంగా మధుమేహ సమస్య ప్రారంభమవుతుంది.

అధిక బరువు : మటన్‌లో ప్రొటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే.. కొవ్వు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ కొవ్వు మన శరీరంలో పేరుకుపోయి అదనపు బరువు పెరగడానికి దారితీస్తుంది. అందువల్ల మటన్ తినేవారు నియంత్రణ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Dasara Special Non Veg Recipes : దసరాకి మటన్​ కర్రీ ఇలా ట్రై చేయండి.. వావ్ అనాల్సిందే..!

గమనిక: ఇది కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించి వారు సూచించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోగలరు.

How to Prepare Mutton Curry : సండే పండగ.. అద్దిరిపోయే మటన్ కర్రీ.. ఇలా చేయండి!

How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.