ETV Bharat / sukhibhava

నిద్ర లేవగానే తలనొప్పి వేధిస్తోందా? - అయితే కారణాలు ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 5:25 PM IST

Headache Reasons : చాలా మందిని సీజన్​తో సంబంధం లేకుండా తలనొప్పి వేధిస్తూ ఉంటుంది. వీరిలో ఉదయం లేవగానే తలనొప్పితో ఇబ్బంది పడేవారూ చాలా మందే ఉంటారు. కొన్నిసార్లు ఇది ప్రాబ్లమ్ కాకపోవచ్చు కానీ.. పదే పదే వస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు నిపుణులు. ఇంతకీ మార్నింగ్ తలనొప్పి రావడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

Headache
Morning Wake Up Headache Reasons

Morning Wake Up Headache Reasons : మార్నింగ్ లేవగానే ఫ్రెష్ మైండ్​తో ఫుల్ ఎనర్జిటిక్​గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ.. కొందరి విషయంలో ఇది సాధ్యం కాదు. తగినంత నిద్ర పోయినప్పటికీ.. చాలా మందికి ఉదయం లేవగానే తలనొప్పి, చిరాగ్గా అనిపిస్తుంది. ఇక వింటర్​లో ఈ సమస్య ఎక్కువ మందిని ఇబ్బందిపెడుతుంది. ఇలా ఉదయం నిద్రలేవగానే తలనొప్పి(Headache) వస్తే అది మన మానసికస్థితిపైనే కాదు.. పని మీదా ప్రభావం చూపుతుంది. మరి.. దీనికి గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఒత్తిడి : ఉదయం లేవగానే వచ్చే తలనొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒత్తిడిని ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం.. ఒత్తిడి లేదా టెన్షన్ తలనొప్పి అత్యంత సాధారణ రకం. ఇది ఎక్కువగా కండరాల ఒత్తిడి కారణంగా సంభవిస్తుంది. తలకు రెండు వైపులా స్థిరమైన నొప్పిని కలగజేస్తుంది. అలాగే ఒత్తిడి వల్ల భుజాలు, మెడలో కండరాలు బిగుసుకుపోతాయని.. వాటి ఫ్రీక్వెన్సీ క్రమంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి మీలో ఈ లక్షణం ఉంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం బెటర్.

మద్యం : ఆల్కహాల్ అనేది ఒక సాధారణ మైగ్రేన్ ట్రిగ్గర్. మద్యం ద్వారా చాలా మందిలో మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఆల్కహాల్‌లో హిస్టామిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను ఎఫెక్ట్ చేస్తుంది. దాంతో అది తలనొప్పికి దారితీస్తుంది. అదేవిధంగా ఆల్కహాల్​లోని ప్రధాన పదార్థం ఇథనాల్​కు సైతం మెగ్రేన్​ను కలిగించే శక్తి ఉంది. అలాగే.. ఇథనాల్ సాధారణం కంటే ఎక్కువ మూత్ర విసర్జనకు గురయ్యేలా చేస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్ తలెత్తే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల కూడా ఉదయం పూట తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

తలనొప్పి తగ్గడం లేదా? ఈ టీ లు ట్రై చేస్తే చిటికెలో మాయం!

హార్మోన్లలో మార్పులు : తరచుగా మైగ్రేన్‌తో బాధపడుతున్న వారిలో ఈస్ట్రోజెన్ స్థాయిల్లో మార్పులూ కారణం కావొచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఋతు చక్రాలు మైగ్రేన్‌లతో ముడిపడి ఉంటాయి. అదేవిధంగా స్త్రీలు గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు కూడా ఎక్కువ తలనొప్పిని ఎదుర్కొంటారు.

సరైన నిద్ర లేకపోవడం : తగిన నిద్రపోకపోయినా.. తీవ్రమైన మైగ్రేన్ ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. మెదడులో న్యూరల్ ప్లాస్టిసిటీ తగ్గడం వల్ల నిద్రలేమి అనే సమస్య తలనొప్పికి కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎవరైనా చాలా తక్కువ నిద్ర పోయినప్పుడు.. మెదడుకు విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం ఉండదు. ఫలితంగా తలనొప్పి వస్తుంది.

సరైన ఆహారం తీసుకోకపోవడం : చాలా సార్లు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ లేదా టెన్షన్ తో కూడిన తలనొప్పికి ఆకలి ప్రధాన కారణం అవుతుందట. మరో విషయం ఏమంటే.. కొన్ని ఆహారాలు తినడం వల్ల కూడా మైగ్రేన్‌ వచ్చే అవకాశం ఉంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, నైట్రేట్లు, పసుపు రంగు ఆహారాలు లేదా మోనోసోడియం గ్లుటామేట్ కలిగిన ఆహారాలు ఈ సమస్యను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. సమస్య ఏదైనా దీర్ఘకాలంగా తలనొప్పి వేధిస్తుంటే వైద్యులను సంప్రదించడమే మంచిదని సూచిస్తున్నారు.

Mental Health Symptoms : తరచూ తలనొప్పి.. దానికి సంకేతమట

తలనొప్పి తగ్గాలంటే నీళ్లు తాగాలా! నీరు ప్రయోజనాలు మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.