Karakkaya Health Benefits: ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ప్రత్యేక స్థానం ఉంది. దంతాల నుంచి జీర్ణకోశ సమస్యల వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే గొప్ప ఔషధంగా చెప్తారు. అసలు త్రిఫల అంటే ఏమిటి..? అందులోని పోషకాలేంటి..? కరక్కాయ ద్వారా కలిగే ఉపయోగాలేంటి? తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం..
త్రిఫల అంటే ఏంటి?: మూడు ఫలాలతో తయారైన చూర్ణం కాబట్టి త్రిఫల చూర్ణం అంటారు. అవి అమలాకి, బిభితాకి, హరితకి(ఉసిరి, తానికాయ, కరక్కాయ). ఆయుర్వేదం ప్రకారం.. ఇవి వాత, పిత్త, కఫ దోషాలను ఇది తొలగిస్తుంది. యాంటీఆక్సిడెంట్స్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు ఫలాల్లో ఒకటైన కరక్కాయలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
సైనస్ ఇబ్బంది పెడుతోందా? ఈ ఆసనాలతో ఫుల్ రిలీఫ్!
కరక్కాయ: కరక్కాయ శాస్త్రీయ నామం టెర్మినాలియా చెబుల్లా. కరక్కాయలు విలువైన జౌషధ గుణాలను కలిగివుంటాయి. వీటిలో యంత్రాక్వినోన్లు, టానిన్లు, ఛెబ్యులిక్ ఆమ్లం, రెసిన్, స్థిర తైలం మొదలనవి ఉంటాయి. ఇది అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులు, అస్తమా, దగ్గు, వాంతులు, కంటి వ్యాధులు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మలబద్ధకం సమస్యను కూడా నివారిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అత్యధికంగా బాధపడుతున్నది షుగర్ వ్యాధితో. అయితే మధుమేహులకు కరక్కాయ ఒక వరం. దీనిని తీసుకోవడం ద్వారా ఇన్సులిన్‌ను స్రవించడానికి ప్యాంక్రియాటిక్ బీటా కణాలను యాక్టివేట్ చేస్తుంది. అలాగే ఇది ఫ్రక్టోజ్‌ను గ్లూకోజ్‌గా విభజించడాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. 2017లో జంతువులపై జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. కరక్కాయ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుందని తేలింది.
రాత్రిళ్లు లేట్‌గా డిన్నర్ చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
జుట్టుకు మేలు: పొల్యూషన్, ఆహార అలవాట్లు, కాస్మోటిక్స్ వాడకం వల్ల జుట్టు చిట్లిపోవడం, పొడిబారడం, తెగిపోవడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. అయితే వీటికి పరిష్కారం అంటే కరక్కాయను చెప్పుకోవచ్చు. కరక్కాయ ఆకులు చుండ్రు, జుట్టు రాలడం సమస్యలను తగ్గిస్తాయి. అలాగే వాపును కూడా తగ్గిస్తుంది. సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి.
స్కిన్ కేర్‌కు బెస్ట్: చర్మ సమస్యల నుంచి కాపాడటానికి కరక్కాయ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం నాణ్యత దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే మొటిమలు, దద్దుర్లు మొదలైన చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో ఇబ్బందా? ఈ ఆయుర్వేద రెమిడీతో ఈజీగా రిలీఫ్!
ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందేందుకు: కరక్కాయలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు.. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే స్త్రీలలో సంతానోత్పత్తిని కూడా పెంచుతుంది.
కళ్లకు మంచిది: ఇది కళ్లకు ప్రయోజనకారిగా ఉంటుంది. కళ్ల మంట, కళ్లు పొడిబారడం, కండ్లకలక వంటి సమస్యలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ - నిద్ర చాలకనే వచ్చాయనుకుంటున్నారా?
మీరు నాన్ వెజ్ తినరా? ప్రొటీన్స్ కోసం ఏం తీసుకోవాలో తెలుసా?
గర్భిణి ఒత్తిడికి గురైతే బిడ్డ ఆరోగ్యంపైనా ప్రభావం - ఈ చిట్కాలను పాటించండి!