ETV Bharat / sukhibhava

How To Reduce Waist Size : నడుము చుట్టూ కొవ్వు తగ్గాలా?.. ఈ సింపుల్​ చిట్కాలు పాటిస్తే అంతా సెట్​! - నడుము చుట్టు కొవ్వు తగ్గించే వ్యాయామాలు

How To Reduce Waist Size : ప్రస్తుత రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి. ముఖ్యంగా చాలా మందిలో నడుము చుట్టూ కొవ్వు పెరిగిపోతోంది. మరి ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

How Ro Reduce Waistline Fat
నడుము చుట్టు కొవ్వును ఎలా తగ్గించుకోవాలి
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 8:07 AM IST

How To Reduce Waist Size : ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్య ఊబకాయం. మరీ ముఖ్యంగా నడుము చుట్టూ కొలత పెరిగిపోవడం. ఈ నడుము చుట్టు కొలత పెరగడానికి ముఖ్య కారణం.. అధికంగా కొవ్వు పేరుకుపోవడమే. ఈ కొవ్వు వల్ల గుండె సంబంధింత వ్యాధులు, మధుమేహం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ సమస్యను అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మన నడుము చుట్టుకొలత మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నడుము, తుంటి భాగాల నిష్పత్తిని అనుసరించి.. ఆయా భాగాల్లో పేరుకున్న కొవ్వు స్థాయిని అర్థం చేసుకునే అవకాశం ఉంది. సాధారణంగా మన శరీర బరువు, ఎత్తు ఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్​ను లెక్కకడుతుంటారు. ఇది ఎక్కువ స్థాయిలో ఉంటే శరీరంలో కొవ్వు స్థాయి అధికంగా ఉన్నట్లు భావిస్తారు.

వెయిస్ట్​ టు హిప్ రేషియోను లెక్కగట్టినప్పుడు నడుము, తుంటి, పిరుదుల భాగంలో పేరుకున్న కొవ్వును అంచనా వేసే అవకాశం ఉంటుంది. మన శరీరంలో ఒక్కో భాగంలోని కొవ్వు ఒక్కో రకమైన అనారోగ్యాలను కలిగించే ప్రమాదం ఉంటుంది. కనుక నడుము, తుంటి భాగాల్లో ఎంత మేరకు కొవ్వు చేరిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం మధ్య భాగంలో అంటే నడుము చుట్టూ అధికంగా కొవ్వు ఉండి యాపిల్ ఆకారంలో ఉండే వ్యక్తుల్లో గుండె వ్యాధులు, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

డయాబెటిస్ రిస్క్ ఎక్కువే
'ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న వ్యాధుల్లో మెటబాలిక్ సిండ్రోమ్ ఒకటి. ఇది బరువు, నడుము చుట్టుకొలత మీద ఆధారపడుతుంది. నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉంటే తీవ్ర అనారోగ్యాల బారిన పడే ఛాన్స్ ఉంది. వీళ్లకు డయాబెటిస్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. స్త్రీలలో నడుము చుట్టుకొలత అధికంగా ఉంటే పీసీఓడీ సమస్య రావొచ్చు. నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉండేవారిలో ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉండే అవకాశం ఉంది. వీటన్నింటితో పాటు గుండె సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదమూ అధికమే' అని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కేఎస్ సోమశేఖరరావు తెలిపారు.

వెయిస్ట్​ టు హిప్ రేషియో ఆడవారికి 0.80 లేదా అంతకంటే తక్కువగా, మగవారికి 0.95 లేదా అంతకంటే తక్కువగా ఉంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. ఈ నిష్పత్తి ఆడవారికి 0.81 నుంచి 0.85లోపు, మగవారికి 0.96 నుంచి 1.0 వరకు ఉంటే ఆరోగ్య పరిస్థితి కాస్త మధ్యస్థంగా ఉందని అర్థం. ఈ నిష్పత్తి ఆడవారికి 0.86 అంతకంటే ఎక్కువగా ఉన్నా.. మగవారికి 1.0 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నా ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం అధికంగా ఉందని అర్థం.

ఇష్టమైన వ్యాయామం చేయండి
'తరచూ వ్యాయామం చేయడం, రోజూ తీసుకునే డైట్​లో మార్పులు చేయడం ద్వారా ఊబకాయం, నడుము చుట్టుకొలత సమస్యను తగ్గించుకోవచ్చు. పలు యోగాసనాలను సాధన చేయడం ద్వారా దీని నుంచి బయటపడొచ్చు. ఆహారంలో ముఖ్యంగా పండ్లు, కాయగూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. నూనె, కొవ్వు పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. రోజూ 45 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్ లేదా మీకు ఇష్టమైన ఏదో ఒక వ్యాయామం చేయాలి. దీని వల్ల నడుము చుట్టుకొలతను తగ్గించుకోవచ్చు. నడుము చుట్టుకొలత 38కి మించితే మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి' అని డాక్టర్ సోమశేఖరరావు తెలిపారు.

పొట్టలో కొవ్వు, నడుము కొలత తగ్గాలంటే అన్ని పోషకాలు కలిగిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. భోజనంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. నూనె పదార్థాలను ఎక్కువగా తినకూడదు. ఆల్కహాల్ పరిమితికి మంచి తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్రమైన హాని కలుగుతుంది. అందువల్ల మద్యపానాన్ని మానేయాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల పొట్టతో సహా శరీరంలో ఉండే అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

చెమటతో కొవ్వు మాయం
మంచి ఫలితం పొందాలంటే రోజూ కనీసం 30 నిమిషాలు చొప్పున వారానికి కనీసం 5 రోజుల పాటు వ్యాయామం చేయాలి. చెమట పట్టేలా కసరత్తులు చేసి హృదయ స్పందన రేటును పెంచాలి. దీని వల్ల కూడా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గడం కోసం వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, సరిపడా నీళ్లు తాగడంతోనే సరిపెట్టుకోకూడదు. అధిక కొవ్వు ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. నిత్యం కొంత సమయమైనా వ్యాయామం చేస్తే బొడ్డు చుట్టూ చేరిన కొవ్వు, అధిక బరువును తగ్గించుకోవచ్చు. దీంతో పాటు నడుము కొలతను అదుపులో ఉంచుకోవచ్చు.

నడుము చుట్టు కొవ్వును ఎలా తగ్గించుకోవాలి?

Diabetes Control Tips In Telugu : మధుమేహంతో ఇబ్బందా?.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఫుల్​ రిలీఫ్!

Milk Before Bed Is Good Or Bad : నిద్రపోయే ముందు పాలు తాగుతున్నారా? ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.