ETV Bharat / sukhibhava

మీ ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా లేకపోతే - ముఖ్యంగా పెళ్లైన వాళ్లకు - ఈ సమస్యలు గ్యారెంటీ! - ప్రైవేట్ పార్ట్స్ పరిశుభ్రత విషయంలో ఇవి తప్పనిసరి

How to Keep Private Parts Clean and Fair : ప్రతి ఒక్కరూ రోజూ స్నానం చేయకపోయిన పర్వాలేదు.. కానీ, ప్రైవేట్ పార్ట్స్​ విషయంలో పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా చాలా వేగంగా వ్యాపిస్తుంది. అలాగే లైంగిక చర్యలో పాల్గొనప్పుడు కొన్ని పరిశుభ్రత చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..

How to Keep Private Parts Clean and Fair

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2023, 5:32 PM IST

How to Keep Private Parts Clean and Fair : ప్రతీ ఒక్కరి జీవితంలో శుభ్రత ఎంతో కీలకం. ఇందులోనూ ప్రైవేట్​ భాగాలను క్లీన్​గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పెళ్లైన ఆడ, మగ విషయంలో ఇది అత్యంత కీలకం. వైవాహిక జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా కొనసాగడానికి.. లైంగిక చర్య(సెక్స్) ఎంతో హోల్ప్ చేస్తుంది. అయితే.. అపరిశుభ్రంగానే ఈ చర్యలో పాల్గొంటే.. అనేక ఇన్​ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. తద్వారా భాగస్వాములిద్దరూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

అక్కడ షేవ్ చేయాలా వద్దా?

స్త్రీ, పురుషులకు ప్రైవేట్ భాగాల్లో హెయిర్ వస్తుంటుందన్నది తెలిసిందే. బాక్టీరియా వ్యాపించడంలో అది ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీంతో.. మాగ్జిమమ్ తొలగిస్తుంటారు. అయితే.. ఈ విషయంలో నిపుణులు ఓ సూచన చేస్తున్నారు. అక్కడ పూర్తిగా షేవ్ చేయకూడదని చెబుతున్నారు. షేవ్ చేయడం వల్ల అక్కడ ఉండే పొర తొలగిపోయి అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల.. ట్రిమ్ చేస్తే మంచిదని సూచిస్తున్నారు.

Sex Stamina Increase Tips : సెక్స్ స్టామినా పెంచుకోవాలా?.. రోజూ గంట వాకింగ్​ చేస్తే చాలు!

డెంటల్ కేర్ అవసరం..

లైంగిక పరిశుభ్రతలో నోటి శుభ్రత అనేది కచ్చితంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే.. ఎలాంటి రొమాంటిక్ ఫీలింగయినా.. ముద్దు నుంచే మొదలవుతుంది. అయితే.. అదర చుంభనం ద్వారా.. బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వేగంగా ట్రాన్స్​ఫర్ అవుతుంది. దాంతో.. భాగస్వామికి కూడా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే.. సెక్స్​కి ముందు, తర్వాత కూడా మౌత్ వాష్ అనేది కచ్చితంగా చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే చూయింగ్ గమ్, మౌత్ ఫ్రెషనర్​లూ వాడొచ్చని చెబుతున్నారు.

యోని శుభ్రత..

మహిళలు యోని శుభ్రతలో అస్సలు రాజీ పడకూడదని చెబుతున్నారు. ఆడవాళ్ల ఆరోగ్యం విషయంలో యోని కీలకమైన పాత్ర పోషిస్తుందని అంటున్నారు. అందువల్ల.. ఆ భాగం ఎంత పరిశుభ్రంగా చూసుకుంటే.. మీ ఆరోగ్యం అంత బాగుంటుందట. అందువల్ల సెక్స్​లో పాల్గొనే ముందు.. తర్వాత కూడా శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ ప్రాంతం క్లీన్ చేయడానికి వినియోగించే సబ్బులో.. pH బ్యాలెన్స్​ గా ఉండే వాటిని ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. మీ జననాంగాలను రెగ్యులర్​గా గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మంచిదని.. అలాగే ఎప్పుడూ లోదుస్తులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

ఆ ప్రదేశాలలో వద్దు..

సహజంగా కోరిక కలిగినప్పుడు లైంగిక చర్యలో పాల్గొంటే మంచిదే. అయితే.. ఎక్కడపడితే అక్కడ ఈ చర్యలో పాల్గొనకూడదని సూచిస్తున్నారు. కొందరు ఫాంటసీల కోసం బీచ్​లు, ఇతరత్రా అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ప్లాన్ చేస్తారు. ఇలాంటి ప్రాంతాల్లో పాల్గొనడం ద్వారా.. బాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల.. అలాంటి ప్రదేశాల్లో సెక్స్(Sex)​లో పాల్గొనకపోవడమే మంచిదంటున్నారు. ఈ సూచనలను పాటించడం ద్వారా.. రెగ్యులర్​గా వచ్చే ఇన్​ఫెక్షన్ల నుంచి మీ ప్రైవేట్ భాగాలను సహజంగా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

How To Increase Sexual Feelings : సెక్స్ లైఫ్​ డల్​గా ఉందా?.. ఈ చిట్కాల‌తో మీ లైంగిక ఆసక్తి డబుల్​!

పగటిపూట శృంగారం చేస్తే పిల్లలు ఆరోగ్యంగానే పుడతారా? జ్వరంతో సెక్స్ చేయొచ్చా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.