ETV Bharat / sukhibhava

How to Build Self Confidence in Children : మీ పిల్లలు ఆత్మవిశ్వాసం కోల్పోయారా? ప్రధాన కారణం మీరేనట.. ఈ టిప్స్​ ఫాలో అవ్వండి! - పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంపొందించే బెస్ట్ టిప్స్

How to Build Self Confidence in Your Childs : మీ పిల్లలు ఎప్పుడూ బెరుగ్గా ఉంటున్నారా..? లోలోపలే ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇలాంటి పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతిందని తల్లిదండ్రులు గమనించి.. అది పెంపొందించే ప్రయత్నం చేయాలంటున్నారు నిపుణులు. అందుకోసం మీరు ఈ 10 టిప్స్ పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు.

Self Confidence in Your Childs
Self Confidence
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 4:40 PM IST

How to Build Your Child's Self Confidence : సాధారణంగా పిల్లల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. అయితే.. చాలా మంది పిల్లలు ఆత్మన్యూనతా భావంతో తమకు ఏదీ రాదని, ఏమీ చేయలేమని అనుకుంటూ.. అందరికంటే వెనుకంజలో ఉండిపోతారు. ఏ పని చేయాలన్నా ముందడుగు వేయడానికి సంకోచిస్తారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రుల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడమే అంటున్నారు మానసిక నిపుణులు. అలాంటి సందర్భాల్లో పిల్లలకు అండగా నిలుస్తూ.. వారిలో ఆత్మవిశ్వాసం(Self Confidence) పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు.

Best 10 Tips to Build Self Confidence in Your Childs : ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుండడంతో.. చిన్న చిన్న విషయాలకే కుంగిపోతూ.. ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. కాబట్టి పేరెంట్స్ తమ పిల్లలలో చిన్నతనం నుంచే ఆత్మవిశ్వాసం నింపేందుకు కృషి చేయాలి. పిల్లలు తమ జీవితంలో సానుకూలంగా ముందడుగు వేయడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు(Parents) పిల్లలకు చిన్నప్పటి నుంచే ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా దాన్ని ఎలా ఎదుర్కోవాలో మీ జీవితానుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు వారితో పంచుకోవాలి. మీ పిల్లలు ఎప్పుడైనా బెరుగ్గా, బిడియంగా ఉంటే.. వారిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందని గ్రహించండి. వెంటనే వారిలో ఆ భయాన్ని పోగొట్టేందుకు ప్రయత్నించండి. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి తల్లిదండ్రులు పాటించాల్సిన 10 బెస్ట్ టిప్స్​తో మీ ముందుకు వచ్చాం. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సానుకూలంగా మాట్లాడండి : ఎప్పుడైనా వైఫల్యాలు ఎదురైనప్పుడు అవి పిల్లల ఆత్మవిశ్వాసంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఓటమిని కొన్ని సందర్భాల్లో అంగీకరించాలని, వైఫల్యాలు జీవితంలో ఒక భాగమని చెప్తు వారితో సానుకూలంగా మాట్లాడండి. అలాగే మీ జీవితంలో ఎదుర్కొన్న వాటి గురించి చెప్పి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి.

షరతులు లేని ప్రేమను చూపండి : ఆత్మవిశ్వాసం అనేది మంచి ప్రేమ, అనుభూతి, భద్రత నుంచి వస్తుంది. కాబట్టి మీ పిల్లల పట్ల షరతులు లేని ప్రేమను చూపడం వలన వారికి భద్రత, స్వంతం అనే భావన కలుగుతుంది. అది వారికి తమ గురించి మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీ బిడ్డ తప్పులు చేసినా లేదా చెడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వారిని ప్రేమించండి. అలాగే వారిని విమర్శించకుండా ఉండండి.

మంచి రోల్ మోడల్ అవ్వండి : తల్లిదండ్రులు తమ జీవితాలను ఎలా గడుపుతున్నారు.. వైఫల్యాలను ఎలా ఎదుర్కొంటున్నారు.. విజయాన్ని ఎలా పొందుతున్నారనే విషయాలను పిల్లలు నిరంతరం గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీరు అత్యంత విశ్వాసంతో ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఉద్యోగంలో స్థిరపడినప్పుడు అది గమనిస్తారు. అప్పుడు తాము ఏ పనినైనా చేయగలమన్న భావన.. తల్లిదండ్రులే తమ రోల్ మోడ​ల్​ అనే ఆలోచన వారిలో వస్తుంది.

మీ అమ్మాయి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలంటే...

మీ పిల్లలను ఇతరులతో పోల్చకండి : మీ పిల్లలను వారి తోటివారితో పోల్చడం మానుకోండి. ఎందుకంటే.. ఇది వారి ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది. పిల్లలు తమ తల్లిదండ్రులను ఎల్లవేళలా సంతోషపెట్టాలని కోరుకుంటారు. కానీ, అలా చేయలేనప్పుడు అది వారి విశ్వాసాన్ని తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ కంటే మెరుగ్గా ఉన్నారనే భావన వారిలో కలిగి ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఇతరులతో పోల్చకండి.

వారి ప్రయత్నాలను మెచ్చుకోండి : కేవలం పిల్లలు మంచి ఫలితం సాధించినప్పుడు మాత్రమే ప్రశంసించకుండా.. వారు చేసే ప్రతి పని ప్రయత్నాన్ని, అందులో పొందే పురోగతిని మెచ్చుకోండి. ఉదాహరణకు మీ బిడ్డ కొత్త సంగీత వాయిద్యాన్ని నేర్చుకుంటున్నట్లయితే.. లేదా ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నట్లయితే వారిని అభినందించండి. మీ ప్రోత్సాహం వారి అభివృద్ధికి మరింత తోడ్పడుతుంది.

కొత్త విషయాలు తెలుసుకోవడానికి వారిని ప్రోత్సహించండి : డ్యాన్స్ క్లాస్‌లో చేరినా లేదా స్కూల్‌లో ఫుట్‌బాల్ టీమ్‌లో భాగమైనా కొత్త విషయాలను కొనసాగించేలా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలి. కొత్త విషయాలను ప్రయత్నించడంలో ధైర్యంగా ఉంటారని, అందులో రాణించగలరని వారిని ఎంకరేజ్ చేయాలి. కొత్త విషయాలను నేర్చుకోవడం మీ పిల్లల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఎంతో సహాయపడుతుంది.

low self esteem in women : ఆ విషయాల్లో మీరూ ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా?

మీ పిల్లలకు బాధ్యత ఇవ్వండి : మీ పిల్లలకి వారి వయస్సుకి తగిన కొన్ని బాధ్యతలను అప్పగించండి. ఉదాహరణకు వారికి కొన్ని ఇంటి పనులను ఇవ్వండి. అది సాఫల్య భావాన్ని అందిస్తుంది. వారు బాగా చేస్తున్న పనులలో వారి ప్రయత్నాలను ప్రశంసించండి. గడిచే ప్రతి రోజు బాగుపడతారని వారికి చెప్పండి. ఇది వారిలో విశ్వాసం, స్థితిస్థాపకతను పెంపొందించడంలో చాలా తోడ్పడుతుంది.

వారి బలాలపై శ్రద్ధ వహించండి : మీ పిల్లలు ఏమి చేస్తున్నారో గమనించండి. వారికి ఏది ఇష్టమో దేనిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారో తెలుసుకోండి. అప్పడు ఏ పని చేయటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారో.. అప్పుడు వారి బలాలపై దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇది వారి గురించి మంచి అనుభూతిని కలిగిస్తుంది. వారి సామర్థ్యాలపై విశ్వాసాన్ని పెంపొందేలా చేస్తుంది.

మీ బిడ్డ విఫలం కావడానికి అనుమతించండి : తల్లిదండ్రులు తమ బిడ్డను వైఫల్యం నుంచి రక్షించాలని కోరుకోవడం సహజం. కానీ కొన్ని సందర్భాల్లో మీ పిల్లలు ఏదైనా విషయంలో విఫలమైతే వారిని విమర్శించకుండా.. మరింత ఎక్కువ ప్రయత్నం చేసేలా వారిని ప్రేరేపించండి. ప్రతి ఎదురుదెబ్బనూ వృద్ధి, అభివృద్ధికి అవకాశంగా మార్చుకోవాలని వారికి సూచించండి.

లక్ష్యాలను సెట్ చేయండి : చిన్నదైనా, పెద్దదైనా వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించడం వాటిని సాధించినప్పుడు పోత్సహించడం చేస్తే.. వారిలో బలాన్ని, సామర్థ్యాన్ని పెంచుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు తమ కలలను లక్ష్యాలుగా మార్చుకోవడంలో సహాయపడాలి. వారు సాధించాలనుకుంటున్న విషయాలను రాసి.. వారి లక్ష్యాలను సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడంలో వారికి సహాయపడాలి. ఇలా మేం చెప్పిన ఈ పది టిప్స్ పాటిస్తే.. మీ పిల్లల్లో తప్పక మార్పు వస్తుంది. ఆల్ ది బెస్ట్..

మీ చిన్నారులు తడబడుతున్నారా.. అయితే ఇలా చేయండి!

అంధురాలి ఆత్మవిశ్వాసం.. రెండు కళ్లు కోల్పోయినా.. యూట్యూబ్​లో వంటలు..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.