How Much Water To Drink a Day : మనం బతకడానికి ఆహారం ఎంత ముఖ్యమో నీరూ అంతే ముఖ్యం. కొన్ని రోజులు ఆహారం తీసుకోకుండా అయినా ఉండగలం కానీ.. నీరు లేకుండా బతకలేం. కాబట్టి మనుషులకే కాదు.. ఈ భూమి మీదున్న ప్రతి జీవికీ నీరు ఎంతో అవసరం. అయితే.. మనం రోజుకి ఎంత నీరు తాగాలి అనే అంశంపై వివిధ అభిప్రాయాలున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతారు. మరి నిజంగా మనకు రోజుకి ఎంత నీరు కావాలి ? ఎంత నీరు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనే అంశాల గురించి తెలుసుకుందాం.
ఒక మనిషి రోజుకి ఎంత నీరు తీసుకోవాలి అనే విషయంపై మొదటిగా 1940ల్లో చర్చ మొదలైంది. సాధారణంగా రోజూ 8 గ్లాసుల నీరు తాగాలని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు సూచించింది. 8 గ్లాసుల నీరు అంటే 2.5 లీటర్లు. కానీ ఇది అప్పటి మాట. ప్రస్తుతం ప్రపంచం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. జ్ఞానం అంతకంతకూ పెరుగుతోంది. మరి నీరు తాగే విషయంలో ఇప్పటి మాటేమిటి ? ప్రస్తుతం రోజూ మనకు ఎంత నీరు కావాలి ?
ఈ ప్రశ్నకు సమాధానం భిన్నంగా ఉంటుంది. 2004లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇంజినీరింగ్ అండ్ మెడిసిన్ ఒక రోజుకి పురుషులు 125 ఔన్సుల (3.7 లీటర్లు), మహిళలు 91 ఔన్సుల (2.7 లీటర్లు) తీసుకోవాలని సిఫార్సు చేసింది. కానీ ఒక వ్యక్తి వయసు, లింగం, ఆరోగ్య స్థితి ఆధారంగా నీటిని తీసుకోవాలని అమెరికా అగ్రికల్చర్ డిపార్టుమెంట్ సూచించింది. వేడి వాతావరణంలో నివసించే వారు, ఎక్కువసేపు వ్యాయామం చేసే వారు కూడా తగినంత నీళ్లు తీసుకోవాలని పేర్కొంది.
నీటిని కచ్చితంగా నీటి రూపంలోనే తీసుకోవాలా ?
వయోజన పురుషుల విషయంలో అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ సిఫార్సులు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. అనగా స్త్రీ, పురుషులిద్దరూ 91 ఔన్సుల (2.7 లీటర్లు) నీరు తాగాలని చెప్పింది. అయితే మన శరీరానికి కావాల్సిన ద్రవాలు కచ్చితంగా నీటి రూపంలోనే తీసుకోవాల్సిన అవసరం లేదని అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. సాధారణంగా ప్రజలు తమ రోజూ వారీ 20 శాతం నీటిని ఆహార రూపంలో తీసుకుంటారు.
మన శరీరానికి అవసరమైన ద్రవాలు జ్యూస్, పాలు, కెఫిన్ కలిగిన పానీయాల ద్వారా పొందవచ్చని 2007లో పరిశోధకులు గుర్తించారు. ఎక్కువ నీరు తీసుకోవడం ప్రమాదానికి సైతం దారితీస్తుందని తెలిపారు. కొవ్వు రహిత పాలు (ఫ్యాట్ ఫ్రీ మిల్క్) లాంటి తక్కువ క్యాలరీలు కలిగిన లేదా క్యాలరీలు లేని పానీయాలు తీసుకోవడం మంచిది. మన శరీరాలు 60 శాతం నీటితో నిండి ఉంటాయి. కాబట్టి వాటికి తగిన నీరు అవసరం. అందుకే తగినంత నీరు తీసుకోవడం తప్పనిసరి.
Water Drinking Benefits : నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు :
- శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.
- కణజాలం, వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది.
- మూత్రం, చెమట వంటి వ్యర్థాలు బయటికి వెళతాయి.
- రక్తాన్ని పంపింగ్ చేయడం.
Ways of Drinking Water : అంతేకాకుండా తగినంత నీరు తాగకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అది అలాగే కొనసాగితే.. కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడతాయి. మీరు డీహైడ్రేట్గా ఫీల్ అయినప్పుడు కళ్లు తిరగడం, నోరు పొడిబారడం, మూత్రం ముదురు రంగులో రావడం వంటి లక్షణాలు కనబడతాయి. మరి తగినంత నీరు తీసుకునే సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు అంటే..
1. వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవడం : మీరు ఎక్కడికైనా బయటికి వెళితే.. మీతో పాటు పెద్ద వాటర్ బాటిల్ తీసుకెళ్లండి. అది తక్కువ దూరమైనా సరే. పెద్ద వాటర్ బాటిల్ వల్ల తగినంత నీరు అందుబాటులో ఉండి దాహం వేసినప్పుడు ఇబ్బంది ఉండదు.
2. రోజంతా నోటిని నీటితో నింపితే బోర్ కొడుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా పుదీనా, కేలరీలు లేని, సహజమైన సువాసనలతో దీన్ని నింపండి. ఘనీభవించిన బెర్రీలు ఐస్ క్యూబ్‌లకు రుచికరమైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి.
3. భోజనం సమయంలో నీరు తాగండి : చాలా మంది భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగరు. ఆ సమయంలో మధ్యమధ్యలో సాఫ్ట్ డ్రింక్స్ బదులుగా నీరు తాగండి.
Skipping Health Benefits : పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా?.. రోజూ 'స్కిప్పింగ్' చేస్తే చాలు!
Vegetarian Tips Protein : వెజిటేరియన్ డైట్ పాటిస్తున్నారా? పోషకాలన్నీ అందాలంటే ఎలా?