ETV Bharat / sukhibhava

హైబీపీతో బాధపడుతున్నారా?.. ఇవి తింటే ఈజీగా తగ్గిపోతుంది!

High BP Control Food : ఇటీవల చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అయితే, మనం తీసుకునే ఆహారం ద్వారానే హైబీపీని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. హైబీపీని ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

high blood pressure treatment
high blood pressure treatment
author img

By

Published : Jun 22, 2023, 7:10 AM IST

High Blood Pressure Foods to Avoid : ఆధునిక జీవితంలో మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాల్లో ఒత్తిడి, కుటుంబ సమస్యలతో చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగ, వ్యాపార పనుల్లో చాలామంది తీరిక లేకుండా గడుపుతూ ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవడమే మానేశారు. ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, సరైన డైట్ పాటించకపోవడం వల్ల అధిక రక్తపోటుకు గురవుతున్నారు.

High BP Control Food : ఇటీవల చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. హైబీపీ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అధిక రక్తపోటు శరీరంలోని అవయవాలు, దాని విధులకు హాని కలిగిస్తుంది. దీని వల్ల ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశముంటుంది. అందుకే బీపీ స్థాయిలను అదుపులో ఉంచుకోవడమనేది చాలా ముఖ్యం. అధిక రక్తపోటును నియంత్రించి తక్కువ బీపీ స్థాయిలను కలిగి ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూరల వల్ల అదుపులో బీపీ
ఆకుకూరల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆకుకూరల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇక టమాటాలు, బంగాళదుంపలు, బీట్‌రూట్, చిలగడ దుంపలు, వెల్లుల్లి, పుచ్చకాయలు, అరటిపండ్లు, అవకాడోలు, కివి, బెర్రీలు, నారింజ, ఆప్రికాట్ వంటి వాటిల్లో లైకోపీన్, పొటాషియం, నైట్రిక్ యాసిడ్, మెగ్నీషియం, విటమిన్ సి, ఆంథోసైనిక్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

బీన్స్‌తో బీపీకి చెక్
బీన్స్, పప్పులు, కాయ ధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్ లాంటి పోషక విలువలు చాలా లభిస్తాయి. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తనాళాల పనితీరును మెరుగుపర్చి అధిక రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. అలాగే బాదం, పిస్తా, వాల్‌నట్ వంటి నట్స్‌లలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి కూడా రక్తపోటును తగ్గిస్తాయి.

తృణధాన్యాలతో ఉపయోగాలెన్నో..
రోల్డ్ ఓట్స్‌లలో బీటా గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ప్యాకింగ్, ప్రాసెస్, శుద్ధి చేసిన ఆహార పదార్థాల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

కెఫిన్ తగ్గించండి
Foods For High Blood Pressure : కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. కెఫిన్ తీసుకోవడం వల్ల విడుదలయ్యే ఆడ్రినలిన్ అనే పదార్థం రక్తపోటును మరింత పెంచుతుంది.

చల్లని నీటితో స్నానం
High BP Home Remedies : నిద్రపోయే ముందు చల్లని నీటితో స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడమే కాకుండా మంచి నిద్ర కూడా వస్తుంది. రాత్రి నిద్ర రక్తపోటుతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే రోజూ వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం లాంటివి చేయడం, ఒత్తిడికి గురి కాకుండా పాటలు వినడం వల్ల అధిక రక్తపోటును తగ్గించుకోవడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.