ETV Bharat / sukhibhava

'ఫిట్‌నెస్‌' కోసం వ్యాయామం చేస్తున్నారా?.. కానీ ఆ పొరపాట్లు మాత్రం.. - వ్యాయామాల రకాలు

ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు కొందరు జిమ్​కు వెళ్లి వ్యాయామం చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్నచితకా కారణాలతో వ్యాయామాన్ని ఆపేయడం కరెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు.

fitness mistakes to avoid
ఫిట్‌నెస్‌
author img

By

Published : Dec 22, 2022, 7:37 AM IST

శరీర సామర్థ్యం (ఫిట్‌నెస్‌) బాగుంటే ఆరోగ్యమూ బాగుంటుంది. దీనికి వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దీన్ని సక్రమంగా చేయటం ముఖ్యం.

ఇవీ పాటించండి:

  • చిన్నా చితకా కారణాలతో వ్యాయామాన్ని ఆపటం తగదు. దీంతో ఫిట్‌నెస్‌ లక్ష్యాన్ని చేరుకోవటం కష్టమవుతుంది. అప్పటివరకూ సాధించిన పురోగతి వెనక పడుతుంది.
  • వ్యాయామాలకు ఉపక్రమించటానికి రెండు గంటల ముందు భోజనం చేస్తే కండరాలకు తగినంత రక్తం సరఫరా కాదు. దీంతో వ్యాయామ బడలిక నుంచి కోలుకోవటం కష్టమవుతుంది. కండరాలు పట్టేయటం, వికారానికి దారితీస్తుంది.
  • ముందుగా సన్నద్ధ వ్యాయామాలు చేయటమూ ముఖ్యమే. దీంతో శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. రక్త సరఫరా పుంజుకుంటుంది. ఫలితంగా కండరాలు వదులవుతాయి. తేలికగా కదులుతాయి.
  • కండరాలను సాగదీసే సమయంలో కుదురుగా, స్థిరంగా ఉండటం తప్పనిసరి. అటూఇటూ కదులుతున్నట్టయితే కండరాలు నొప్పి పుడతాయి. బిగుతుగా అవుతాయి. శరీరాన్ని సాగదీసిన ప్రతిసారీ 20 నుంచి 30 సెకండ్ల పాటు అదే భంగిమలో ఉండాలి.
  • సరైన భంగిమలో ఉండేలా చూసుకోవటం ప్రధానం. లేకపోతే కింద పడిపోవచ్చు, గాయాలు కావొచ్చు. ఉదాహరణకు- ట్రెడ్‌మిల్‌ మీద నడిచేటప్పుడు పరికరం మీద వాలిపోవద్దు. శరీరం తిన్నగా ఉండేలా చూసుకోవాలి. బరువులు ఎత్తేటప్పుడు వెన్నెముకను తిన్నగా.. భుజాలు వెనక్కి, విశ్రాంతిగా ఉంచాలి. మోకాళ్లను మరీ బిగుతుగా పట్టి ఉంచొద్దు.
  • కొన్నిరకాల వ్యాయామాలు చేస్తున్నప్పుడు సహజంగానే ఊపిరి బిగపడుతుంటారు. ఇది తగదు. ఊపిరి బిగపడితే శరీరానికి ఆక్సిజన్‌ తగ్గుతుంది. కాబట్టి బరువులు ఎత్తుతున్నప్పుడు ముందే గట్టిగా శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా బయటకు వదలాలి.
  • సామర్థ్యాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. శక్తికి మించి బరువులు ఎత్తితే నొప్పులు మొదలవుతాయి. మొత్తానికే వ్యాయామాలను ఆపేయాల్సి రావొచ్చు. ఒకవేళ ఎక్కువ బరువులు ఎత్తాలనుకుంటే ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా పెంచుకుంటూ రావాలి. అనువుగా అనిపించినప్పుడే అదనపు బరువును జోడించుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.