ETV Bharat / sukhibhava

ఆకలి లేకున్నా భోజనం! - "చంద్రముఖి"లో రజనీకాంత్ డైలాగ్ గుర్తుందా? - Eating Without Hunger

Eating Without Hunger Side Effects: చంద్రముఖి సినిమాలో.. జ్యోతికతో రజనీకాంత్ ఓ డైలాగ్ చెప్తాడు. "భోజనం.. అది మితంగా తింటే ఔషధం.. అమితంగా తింటే విషం!" అని అంటాడు. ఆరోగ్య నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. అయితే.. అకలి వేసినప్పుడు అతిగా తినడం సంగతి అటుంచితే.. కొందరు ఆకలి లేకున్నా తినేస్తుంటారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

Effects on the Body Eating Without Hunger

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 12:44 PM IST

Effects on the Body Eating Without Hunger : ఒత్తిడి, ఆందోళన వంటివి చుట్టుముట్టినప్పుడు.. ఆ ప్రభావం మనసుపై ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ.. శరీరంపై ఎలా ఉంటుందో మాత్రం అందరికీ తెలియదు. ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలకు లోనైనప్పుడు చాలా మంది ఆకలి లేకున్నా తింటుంటారు. మరికొంతమంది బోర్ కొడుతోంది అనుకుంటా ఏదో ఒకటి నోట్లో వేసుకుంటారు. మరికొన్ని సార్లు పక్కవారి బలవంతం వల్ల తినాల్సి వస్తుంది. మరి, ఇలా ఆకలి లేకున్నా తినడం వల్ల ఆరోగ్యం ఏమవుతుందో తెలుసా?

మీ పరుపు ఎన్నాళ్లకు మార్చేయాలి? - లేకపోతే ఏమవుతుంది?

రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం: ఆకలిగా లేనప్పుడు తినడం రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తిన్నప్పుడు ఇది ఎక్కువగా ఉంటుంది. వీటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్, టైప్ 2 డయాబెటిస్‌తో సహా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

మీ కళ్లు ఎర్రగా మారుతున్నాయా? - ఈ చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టండి!

వేగంగా బరువు పెరగడం: ఎలాంటి కారణం లేకుండా తినడం వల్ల బరువు పెరిగి ఊబకాయం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది రోజువారీ అవసరాల కంటే ఎక్కువ కేలరీలను ఇస్తుంది. ముఖ్యంగా మనలో చాలా మంది క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని బ్రేక్​ఫాస్ట్​గా తీసుకుంటారు. టీవీ చూడటం, మొబైల్​ ఫోన్​ వాడేటప్పుడు.. ఇలా రకరకాల పనులు చేసేటప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని లాగించేస్తాం.. దీంతో ఈజీగా బరువు పెరుగుతాం..

బరువు తగ్గడానికి రొట్టె తింటున్నారా?

జీర్ణవ్యవస్థపై ప్రభావం: ఆకలి లేకుండా తినడం అంటే అవసరానికి మించి ఆహారాన్ని తినడమన్నట్లే. ఈ అలవాటు జీర్ణ సమస్యలకు ప్రధాన కారణం కావొచ్చు. ఈ కారణంగా కడుపులో ఉబ్బరం, గ్యాస్ లేదా మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా జీర్ణ ప్రక్రియ మానసిక, శారీరక ప్రక్రియల ద్వారా ప్రభావితమవుతుంది. ఓ అధ్యయనం ప్రకారం.. మనం తింటున్న వాటి గురించి పట్టించుకోకపోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ 30% నుంచి 40% తక్కువ ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టమైంది.

మానసిక స్థితిపై ప్రభావం: ఆకలి లేనప్పుడు తినడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల ఎప్పుడూ ఒత్తిడి, కోపం, బద్ధకం, అలసట, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

గుండె జబ్బులు: ఆకలి లేకున్నా తినే అలవాటు ఉన్నవారికి గుండె జబ్బులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Alert : బ్రేక్​ఫాస్ట్​లో ఈ ఆహారాలు - క్యాన్సర్​ వచ్చే అవకాశం!

నిద్రపై ప్రభావం: చాలా మంది నిద్రపోయే ముందు తినే ఆహారం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ నిద్రభంగం కలగడానికి ప్రధాన కారణం అదే అంటున్నారు నిపుణులు. యూనివర్శిటీ ఆఫ్ అరిజోనా 2018లో జరిపిన ఒక అధ్యయనంలో జంక్ ఫుడ్ కోరికలు.. నిద్రలేమి మధ్య సంబంధం ఉందని కనుగొన్నారు. అధ్యయనంలో తక్కువ నిద్రపోయిన వారిలో 60% మంది రాత్రిపూట ఏదో ఒకటి తినేవారు.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఈటింగ్ డిజార్డర్స్‌లో ప్రచురితమైన మరో అధ్యయనం.. మహిళల్లో అతిగా తినడం "తగినంత నిద్రపోకపోవడం, లేదంటే సరిగా నిద్రపోకపోవడం" వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది.

విటమిన్ D లోపం వల్లే ఆ సమస్యలు - ఏమైందో అని భయపడుతుంటారు!

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? - మీకు "బ్రెయిన్​ ఫాగ్"​ ఉన్నట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.