ETV Bharat / sukhibhava

Cause of Migraine: మైగ్రెయిన్​కు ప్రధాన కారణమిదే! - మైగ్రెయిన్​ సమస్య

Cause of Migraine: తల ఒకవైపు పేలిపోతున్నంత బాధ. తలలో ఎవరో సమ్మెటతో మోదుతున్నట్టుగా నొప్పి. దీనికి తోడు వికారం, వాంతి. అందుకే పార్శ్వనొప్పి పేరు వినగానే చాలామంది బెంబేలెత్తిపోతారు. ఇది కొందరిని తరచుగా.. మళ్లీ మళ్లీ వేధిస్తుంటుంది. అసలు దీనికి కారణాలేంటి?

Causes of Migraine Headache
Causes of Migraine Headache
author img

By

Published : Feb 3, 2022, 7:21 AM IST

Cause of Migraine: పార్శ్వనొప్పి బాధ వర్ణనాతీతం. లోపల ఏదో బాదుతున్నట్టు ఒకటే నొప్పి. ఇదొక్కటేనా? వికారం, వాంతి.. వెలుతురు, చప్పుడు తట్టుకోలేకపోవటం వంటివీ ఇబ్బంది పెడుతుంటాయి. ఒకసారి పార్శ్వనొప్పి మొదలైతే 4 గంటల నుంచి 72 గంటల వరకూ కొనసాగొచ్చు. దీంతో కొందరు ఏ పనీ చేయలేరు. పార్శ్వనొప్పి మగవారి కన్నా ఆడవారిలో 2-3 రెట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌. ఇది తలలో కీలకమైన నాడి చుట్టూరా ఉండే కణాలను, అలాగే రక్తనాళాలను పార్శ్వనొప్పి ప్రేరకాలకు త్వరగా స్పందించేలా చేస్తుంది. ఫలితంగా పార్శ్వనొప్పి తలెత్తే అవకాశమూ పెరుగుతుంది.

ఒత్తిడి, నిస్సత్తువ, తిండి మానెయ్యటం, ఒంట్లో నీటిశాతం తగ్గటం, మద్యపానం, కెఫీన్‌, చాక్లెట్లు, పుల్లటి పండ్లు, ఛీజ్‌, నిద్రలేమి.. ఎండ, వేడి, తేమ వాతావరణాలకు గురికావటం, నెలసరి ప్రక్రియ, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతి, పొగ, పెద్ద శబ్దాలు, జనం గుమిగూడే ప్రాంతాలు, గర్భనిరోధక మాత్రల వంటి కొన్ని మందులు, ఘాటైన వాససలు.. ఇలా రకరకాల అంశాలు పార్శ్వనొప్పిని ప్రేరేపిస్తుంటాయి. అందువల్ల ఎలాంటి వాటికి గురైనప్పుడు నొప్పి తలెత్తుతోందో గుర్తించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా దీని బారినపడకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Tips for weight control: బరువును అదుపులో ఉంచుకోండిలా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.