ETV Bharat / sukhibhava

ఇన్సులిన్ సమస్యలు, గుండె జబ్బులు దూరం! బ్రౌన్​రైస్​తో ఎన్నో లాభాలు - brown rice for diabetics

Brown Rice Health Benefits In Telugu : మీరు మధుమేహంతో బాధపడుతున్నారా? భవిష్యత్​లో గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలని భావిస్తున్నాయా? అయితే మీకు గుడ్ న్యూస్​. ప్రతిరోజు బ్రౌన్​ రైస్ (దంపుడు బియ్యం) తినడం వల్ల ఈ సమస్యలు మటుమాయం అవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు ఈ దంపుడు బియ్యం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా?

health Benefits of Brown Rice
Brown Rice health Benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 9:12 AM IST

Brown Rice Health Benefits : మనం తినే అన్నం ఎంత తెల్లగా ఉంటే అంత గొప్పగా భావిస్తున్నాం. ముత్యాల్లా తెల్లగా పాలిష్ పట్టించిన బియ్యాన్ని తినడమే నాగరికత అని అనుకుంటున్నాం. కానీ అది ఏమాత్రం నిజం కాదు. బియ్యాన్ని బాగా పాలిష్ చేయడం వల్ల, పైపొరలని విలువైన పోషకాలు అన్నీ తౌడు రూపంలో వృథాగా పోతున్నాయి. దీనివల్ల పాలిష్ పట్టించిన బియ్యంలో పిండి పదార్థాన్ని మాత్రమే మనం తింటున్నాం. అందుకే దంపుడు బియ్యం తినడం అలవాటు చేసుకోవాలి. పాలీష్ పట్టని దంపుడు బియ్యంలో పోషకాలు దండిగా ఉంటాయి. కనుక ఈ దంపుడు బియ్యం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా బి-విటమిన్ లోపాలను అధిగమించవచ్చు. అలాగే మధుమేహం సమస్యను అదుపు చేయవచ్చని అంటున్నారు వైద్యులు. అందుకే ఈ దంపుడు బియ్యం లేదా బ్రౌన్ రైస్ తినడం వల్లే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

బ్రౌన్ రైస్ ఎందుకు మంచివంటే?
దంపుడు బియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది మొలకెత్తిన బ్రౌన్ రైస్ కూడా తీసుకుంటారు. అయితే బ్రౌన్ రైస్​ను వండటానికి ముందు కొద్దిసేపు నానబెట్టి, తరవాత వంట పూర్తి చేయాలి. ప్రతి రోజు బ్రౌన్ రైస్ తినడం వల్ల డయాబెటిస్​ను అదుపులోకి తెచ్చుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరం
దంపుడు బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఇన్సులిన్​తో వచ్చే చిక్కులు తగ్గుతాయి. అంతేకాదు దంపుడు బియ్యంలో కార్పోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చక్కెర శోషణ రేటును నెమ్మదింపజేస్తాయి. ఫలితంగా చక్కెర వ్యాధి నియంత్రణలోకి వస్తుంది.

గుండె ఆరోగ్యం బలోపేతం
దంపుడు బియ్యం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ధమనులు మూసుకుపోవడం లాంటి గుండె సమస్యలను, స్ట్రోక్స్​ను, గుండె అలసట లాంటి హృదయ సంబంధ సమస్యలను నివారిస్తుంది. ఇది రక్తపోటుని నియంత్రించి, ధమనులు గట్టిపడటం లాంటి ఇతర వాస్కులర్ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మొత్తం మీద ఈ దంపుడు బియ్యం మీ హృదయనాళ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

జీర్ణక్రియ మెరుగు
దంపుడు బియ్యంలో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది. ఇది మలం సాఫీగా బయటకు వెళ్లేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు డాక్టర్లు. అందువల్ల మలబద్ధకం తగ్గుతుంది. మన శరీరానికి ఫైబర్ కంటెంట్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మానవులలో సాధారణ ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా బ్రౌన్ రైస్​ పైపొరలోని పోషకాలకు, ఆమ్ల శోషణను నివారించే శక్తి ఉంటుంది. ఫలితంగా జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. ఇలా బ్రౌన్ రైస్ తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చనని సలహా ఇస్తున్నారు వైద్యులు.

బ్రౌన్ రైస్ - ఆరోగ్య ప్రయోజనాలు

నిద్ర లేవగానే నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

రోజూ అరటిపండు తినడం లేదా? - అయితే ఈ హెల్త్​ బెనిఫిట్స్ మిస్ అయినట్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.