ETV Bharat / sukhibhava

Best Tips to Get Rid of Cockroaches and Lizards: ఈ చిన్న టిప్​తో.. బల్లి, బొద్దింకలు మీ ఇంటివైపు కూడా చూడవు..! - బొద్దింకలు బల్లులను పారద్రోలే బెస్ట్ ఇంటి చిట్కాలు

Best Tips to Get Rid of Cockroaches and Lizards : మీ ఇళ్లలలో బొద్దింకలు, బల్లుల సమస్య ఉందా? తరచుగా అవి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయా? అయితే చాలా మంది వీటిని తరిమికొట్టడానికి రసాయనాలను స్ప్రే చేస్తుంటారు. దాని ద్వారా పిల్లలు, అనారోగ్యానికి గురవతుంటారు. ఇప్పుడు అలా కాకుండా మేము చెప్పే సహజ చిట్కాలు పాటించి చాలా సింపుల్​గా వాటిని మీ ఇంట్లో నుంచి తరిమేయండిలా..

Get Rid of Cockroaches
Best Tips for Get Rid of Cockroaches and Lizards
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 10:07 AM IST

Best Tips to Get Rid of Cockroaches and Lizards Natural Ways : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు.. క్రిములు, కీటకాలు విపరీతంగా పెరుగుతుంటాయి. వీటితో పాటు చీమలు, దోమల బెడద ఎక్కువగానే ఉంటుంది. సహజంగా కొందరు ఈ చీమలు, దోమలు(Mosquitos) కుట్టినా అంత పట్టించుకోరు కానీ.. ఇంట్లో ఎక్కడో దూరంగా గోడమీద పాకే బల్లి, వంటింట్లో తిరగాడే బొద్దింకను చూస్తే.. నార్మల్​గా ఉండలేరు.

Best Tips to Get Rid of Cockroaches and Lizards : బొద్దింకలు(Cockroaches), బల్లులతో నేరుగా ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. అవి హానికర సూక్ష్మజీవులను తరలించే వాహకాలుగా పనిచేస్తాయి. వీటి సంఖ్య ఎక్కువై ఇంట్లో తిరుగుతుంటే చిరాకుగా ఉంటుంది. పొరపాటున మనం తినే ఆహారంలోకి చొరబడితే దానిని తినలేం. అలాగే ఒకవేళ మనకు తెలియకుండా తింటే రోగాల బారినపడటం గ్యారెంటీ. అందుకే.. చాలా మంది వీటిని చంపడానికి స్ప్రేలు వాడుతుంటారు. కానీ.. ఈ స్ప్రేల వల్ల ఇన్నర్ పొల్యూషన్ పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. పిల్లలు, వృద్ధులు ఉండే ఇంట్లో వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఈ నేపత్యంలో.. కొన్ని సహజ పద్ధుతుల ద్వారా వీటిని తరిమికొట్టొచ్చు. ఇంతకీ ఆ మార్గాలేమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Natural ways to Eliminate Cockroaches and Lizards :

బొద్దింకలు, బల్లులను తరిమికొట్టే సహజసిద్ధ మార్గాలివే..

గుడ్డు పెంకులు : చాలా మంది ఇంట్లో ఎగ్ కర్రీ చేసుకోగానే వాటిని డస్ట్​బిన్​లో పారేస్తుంటారు. అయితే.. అలా చేయకుండా ఇంట్లోని తలుపులు, కిటికీలు, వంటగదిలో కొన్ని చోట్ల లేదా ఇతర ప్రదేశాలలో గుడ్ల పెంకులను ఉంచడం ద్వారా బల్లుల బెడద నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే గుడ్ల వాసన వాటికి పడదు కాబట్టి అక్కడికి రాలేవు.

వెల్లుల్లి : వెల్లుల్లి, లవంగాల వాసన కూడా వీటికి పడదు. కాబట్టి వెల్లుల్లి లవంగాలను అక్కడక్కడా మీ ఇంట్లో వేలాడదీయండి. అలాగే వెల్లుల్లి రసాన్ని బల్లులు ఉండే ప్రదేశాల చుట్టూ పిచికారీ చేయండి. ఆ వాసనకు అవి పరార్ అవుతాయి.

కాఫీ, పొగాకు పౌడర్ చిన్న బంతులు : కాఫీ, పొగాకు పొడిని చిన్న బాల్స్‌గా చేసి వాటిని అగ్గిపుల్లలు లేదా టూత్ పిక్స్‌పై అతికించండి. ఆ తర్వాత వాటిని అల్మారాలు, బల్లులు తరచుగా కనిపించే ఇతర ప్రదేశాలలో వీటిని వదిలివేయండి. ఈ మిశ్రమం వాటికి ప్రాణాంతకం. అవి చనిపోగానే తీసిపారేయండి.

Viral Infection Remedies : ఇంటి చిట్కాలతో.. వైరల్​ ఇన్ఫెక్షన్స్​కు చెక్​!

ఉల్లిపాయలు : సాధారణంగా మనం ఉల్లిపాయ తొక్కలు బయటపారేస్తుంటాం. కానీ ఆ ఉల్లిపాయల ఘాటైన వాసన కూడా ఈ జీవులకు నచ్చదు. కాబట్టి మీరు మీ ఇంట్లో తిరగాడే బొద్దింకలు, బల్లులను తరిమికొట్టేందుకు కొద్దిగా ఉల్లిపాయ రసం పిచికారీ చేయండి. దాంతో అవి ఇంట్లో నుంచి పరార్ అవుతాయి.

నాఫ్తలీన్ బంతులు : నాఫ్తలీన్ బంతులు కూడా బల్లులను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మీరు వీటిని వంటగది అల్మారాలు, అవి తిరగాడే కొన్ని ప్రదేశాలు లేదా అల్మారాల్లో ఉంచాలి. వీటి వాసనకు అవి మళ్లీ ఆ ప్రదేశానికి రావు.

కాఫీ గ్రౌండ్స్ : బొద్దింకలను మీ ఇంటి నుంచి దూరంగా తరిమివేయడంలో ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. బొద్దింకలను వదిలించుకోవడానికి మీరు దీన్ని మీ ఇంట్లో వివిధ ప్రదేశాలలో చిన్న పాత్రలలో ఉంచవచ్చు.

బొరాక్స్ షుగర్ : బొద్దింకలు, బల్లులను వదిలించుకోవడానికి ఒక అద్భుతమైన ప్రభావవంతమైన పరిష్కారం ఏమిటంటే బొరాక్స్ 3 భాగాలు.. ఒక భాగం చక్కెర కలపండి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఎక్కువగా కనిపించే చోట చల్లుకోండి. ఈ మిశ్రమం కేవలం కొన్ని గంటల్లో బొద్దింకలను దూరం చేస్తుంది.

How Much Water To Drink a Day : నీటితోనే ఆరోగ్యం.. రోజుకు ఎన్ని లీటర్లు తాగాలో తెలుసా..?

బేకింగ్ సోడా షుగర్ : బోరాక్స్‌ను ఉపయోగించడం అసౌకర్యంగా ఉంటే.. బేకింగ్ సోడా చక్కెర మిశ్రమాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఈ రెండు పదార్థాలను సమాన పరిమాణంలో కలిపి అవసరమైన చోట చల్లుకోండి. ఇవి తిన్న బొద్దింకలు చనిపోతాయి.

ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ : 3 భాగాల ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్ 2 భాగాల నీరు కలిగిన మిశ్రమాన్ని బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో స్ప్రే చేయండి. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని వాసనకు బొద్దింకలు, బల్లులు(Lizards), పారిపోతాయి.

Belly Fat Burning Floor Exercises : జిమ్​కు వెళ్లకుండానే పొట్ట తగ్గాలా?.. ఈ ఫ్లోర్​ ఎక్స్​ర్​సైజ్​లు​ ట్రై​ చేయండి!

Plastic Containers Health Risks : ప్లాస్టిక్ డ‌బ్బాల్లో ఆహారం నిల్వ చేయ‌వ‌చ్చా?.. దీని వల్ల ప్ర‌మాద‌మెంత?

Foods To Avoid In Empty Stomach : పరగడుపున ఇవి తింటున్నారా? అయితే జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.