ETV Bharat / sukhibhava

మెడ నల్లగా ఉందని బాధపడుతున్నారా? - ఈ టిప్స్ ట్రై చేశారంటే తెల్లగా మారడం ఖాయం! - Dark Neck Whitening Tips

Best Tips for Dark Neck : చాలా మందికి ముఖం మెరిసిపోతున్నా.. మెడ దగ్గరకు వచ్చేసరికి మాత్రం నల్లగా ఉంటుంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. మరి ఈ సమస్య తగ్గి.. మెడ కూడా తెల్లగా మారడానికి కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Tips for Dark Neck
Tips for Dark Neck
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 10:41 AM IST

Best Home Remedies for Dark Neck : అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ఫేస్​ప్యాక్​లు, క్రీములు ఇలా ఎన్నో వాడుతుంటారు. అయితే ముఖం విషయంలో అంత శ్రద్ధ చూపించి.. మెడ భాగాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. దీంతో మెడ నల్లగా మారుతుంది. మెడపై ఏర్పడే నలుపు కారణంగా చాలా మంది మహిళలు బయటకు రావడానికి ఇష్టపడరు.

Tips for Get Rid of Dark Neck : ఇక కొందరైతే ఆ మచ్చలు పోగొట్టుకునేందుకు బ్యూటీపార్లర్​లో స్క్రబ్బింగ్, మసాజ్, ఫేషియల్ వంటి చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది. అలాకాకుండా ఈ స్టోరీలో చెప్పే నేచురల్ హోమ్ రెమిడీస్​తో మీ మెడపై ఏర్పడిన నలుపును ఈజీగా తొలగించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా మీ మెడ తెల్లగా మారడం ఖాయమంటున్నారు. మరి, ఆ టిప్స్ ఏంటి? వాటిని ఎలా వాడాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

బేకింగ్ సోడా : అందరి ఇళ్లలో వివిధ వంటకాల్లో ఉపయోగించే బేకింగ్ సోడా.. మెడ ప్రాంతంలోని నలుపును పోగొట్టి చర్మాన్ని మెరిపించేందుకు బాగా పనిచేస్తుంది. దీనిని మంచి స్కిన్ క్లెన్సర్ అని కూడా చెప్పొచ్చు. అలాగే చర్మంపై ఉన్న మురికిని దూరం చేసి చర్మం లోపల నుంచి పోషకాలను పొందేలా చేస్తుంది.

ఎలా వాడాలంటే.. మీరు ముందుగా రెండు, మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని నీరు కలిపి మెత్తగా పేస్ట్​లా చేసుకోవాలి. ఆ తర్వాత దానిని మెడకు అప్లై చేసి.. కొన్ని నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆపై ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మం తేమగా మారి సమస్య తగ్గుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ : చర్మంలో పీహెచ్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు స్కిన్ నల్లగా మారుతుంది. అలాంటి సమస్యకి ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మీ చర్మంలోని మృతకణాలను దూరం చేసి సహజ మెరుపుని అందించడానికి ఇది చాలా సహాయపడుతుంది.

ఎలా వాడాలంటే.. ఇందుకోసం మీరు ముందుగా రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని నాలుగు టేబుల్ స్పూన్ల నీటిలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఓ కాటన్ బాల్ తీసుకుని అందులో ముంచి మెడ ప్రాంతంలో నలుపుగా ఉన్న దగ్గర అప్లై చేయాలి. 10 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత దానిని క్లీన్ చేసుకోవాలి. దీంతో ఈజీగా ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఇలా చేస్తే ముఖం ఎంతో తాజాగా ఉంటుంది!

శనగపిండి : మనం ఇళ్లలో వివిధ పిండి వంటలు చేసుకోవడానికి ఉపయోగించే శనగపిండి కూడా మీ మెడను మెరిపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మెడపై ఉన్న దుమ్ము, ధూళిని పొగొట్టి నలుపు రంగు మాయమయేలా చేస్తుంది.

ఎలా యూజ్ చేయాలంటే.. ముందుగా మీరు ఒక బౌల్​లో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకుని అందులో అర టీస్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. అందులోనే పసుపు, రోజ్ వాటర్, పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని మెడ భాగంలో అప్లై చేసి 15 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఇలా మీరు వారానికి రెండు సార్లు చేస్తే సమస్య ఇట్టే తగ్గిపోతుంది.

బంగాళాదుంప : అలుగడ్డ కూడా మీ చర్మాన్ని కాంతివంతం చేయడానికి ఉపయోగపడుతుంది. వీటిని యూజ్ చేసి కూడా మెడపై డార్క్​ను ఈజీగా తొలగించుకోవచ్చు.

ఎలా వాడాలంటే.. ముందుగా బంగాళాదుంప పొట్టు తీసి మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని మెడపై అప్త్లె చేసుకొని పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. బంగాళాదుంప మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది నల్లగా మారిన చర్మాన్ని తిరిగి ప్రకాశవంతంగా అయ్యేలా చేస్తుంది. నిమ్మ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

How To Look Young Forever : ఆరు పదుల వయసులోనూ యవ్వనంగా కనిపించాలా?.. ఈ 10 టిప్స్​ పాటిస్తే చాలు!

Pimples Removal Tips : మొటిమల సమస్యా?.. ఈ సింపుల్ చిట్కాలతో చెక్!

కాస్మొటిక్స్​ వాడుతున్నారా? ఆ సమస్యలు రావడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.