Best Herbal Teas to Reduce the Headache in Telugu: ఈ ఉరుకులు పరుగుల జీవనశైలితో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి.. వంటివి సహజం. ఇవి తలనొప్పికి దారితీస్తాయి. ఫలితంగా ఏ పనీ చేయాలనిపించదు. అలాగని ఓ మాత్ర వేసేసుకుంటే నిమిషాల్లో ఉపశమనం పొందచ్చు.. కానీ ప్రతిసారీ ఇలాగే చేస్తే మాత్రం దుష్ప్రభావాలతో పాటు పలు ఆరోగ్య సమస్యలూ తప్పవంటున్నారు నిపుణులు. అలాంటి సమయంలో తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే హెర్బల్ టీ లను తాగమని సలహాలు ఇస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
నిద్ర లేచింది మొదలు నిద్రపోయేవరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, తలనొప్పి ఇబ్బంది పెట్టినా.. ఓ కప్పు టీ తాగితే ఎక్కడ లేని ఉపశమనం లభిస్తోంది. అలాగే కూసింత ప్రశాంతత కూడా దొరుకుతుంది. మరి తలనొప్పిని తగ్గించే హెర్బల్ టీ లపై ఓ లుక్కేయండి..
మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా? - కాఫీని మాత్రం అస్సలు తాగొద్దు!
తులసి టీ..: విటమిన్ కే, ఏ లు పుష్కలంగా ఉంటాయి. గుప్పెడు తులసి ఆకుల్ని రెండు కప్పుల నీటిలో వేసి కప్పు నీరు అయ్యేంత వరకూ మరిగించాలి. ఈ పానీయాన్ని టీ లా తాగాలి. ఇది తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
అల్లం టీ: ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో పాటు నొప్పి నుంచి ఉపశమనాన్నిచ్చే రసాయన సమ్మేళనాలుంటాయి. మూడు గ్లాసుల నీటిలో చిన్న అల్లం ముక్క వేసి ఒకటిన్నర గ్లాసు అయ్యేవరకు మరిగించాలి. తర్వాత వడపోసి ఈ కషాయాన్ని తాగాలి. అల్లంలో ఉండే సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచి తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.
త్వరగా నిద్రలేవలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించారంటే అలారం లేకుండానే మేల్కొంటారు!
చామంతి టీ..: ఇందులో ఔషధ గుణాలు అధికం. చామంతి ఒత్తిడిని తగ్గిస్తుంది. వివిధ రకాల డైట్‌లలోనూ దీనిని ఉపయోగిస్తారు. కొన్ని చామంతి పూలను మూడు గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. దింపాక నిమ్మరసం పిండి తాగితే సరి.
సోంపు టీ..: దీనిలో విటమిన్ బి1, బి2, బి3, కాల్షియం, జింక్, ఐరన్, పొటాషియం ఉంటాయి. సోంపును నీళ్లలో వేసి మరిగించి టీ లా సేవిస్తే తలనొప్పి నుంచి ఊరట కలుగుతుంది.
దాల్చిన చెక్క: ఇందులో మాంగనీస్, ఫైబర్, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాలను స్వాంతన పరచి తలనొప్పి తగ్గిస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. రెండు కప్పుల నీరు తీసుకుని.. అందులో కొద్దిగా దాల్చినచెక్క వేసి ఒక కప్పు అయ్యేంతవరకు మరిగించి.. తర్వాత తాగాలి.
మీ పిల్లలు ఫోన్ వదలట్లేదా? - ప్రాణాంతకం కావొచ్చు - ఇలా వదిలించండి!
పుదీనా టీ...: తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి పుదీనా టీ బాగా సాయపడుతుంది. యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటీ నిర్వహించిన ఒక అధ్యయనంలో.. పుదీనా టీ తాగడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుందని స్పష్టం చేసింది. మరిగించిన వేడి నీటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి మూతపెట్టి, పది నిమిషాల తర్వాత తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
లావెండర్ టీ..: ఈ పూలల్లో డై మిథైల్ రసాయనాలు ఉంటాయి. ఇవి నాడీవ్యవస్థ పై పనిచేసి నిద్రలేమిని తగ్గించి, ఒత్తిడికి గురైన నరాలను ఉత్తేజపరుస్తాయి. 15 గ్రాముల లావెండర్ పొడిని లీటర్ వాటర్‌లో వేసి మరిగించి సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. టెన్షన్, తలనొప్పి తీవ్రతను తగ్గించడంలో లావెండర్ టీ ప్రభావవంతంగా పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ఓ అధ్యయనంలో కనుగొంది.
చలికాలంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి - ప్రమాదకరం కావొచ్చు!
కండరాల నొప్పులు బాధిస్తున్నాయా? ఉల్లిపొట్టుతో చెక్ పెట్టండి!