ETV Bharat / sukhibhava

కళ్లలో సమస్యలా? భవిష్యత్తులో ఇబ్బందులే - ఇలా కాపాడుకోండి!

Food and Habits to Improve Eye Health: ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇందుకు కారణాలు అనేకం. అయితే.. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎవరికి వారు తప్పక ప్రయత్నించాలి. కొన్ని అలవాట్లను జీవితంలో భాగం చేసుకోవాలి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

Food and Habits to Improve Eye Health
Food and Habits to Improve Eye Health
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 9:57 AM IST

Food and Habits to Improve Eye Health: స్మార్ట్​ ఫోన్ల వాడకం.. కాలుష్యం.. ఆహారపు అలవాట్లు.. ఇలా పలు కారణాలు కంటి సమస్యలకు కారణం అవుతున్నాయి. ఇలా దృష్టి లోపంతో భాదపడేవారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. కళ్లలో నీరు కారడం, చూపు మందగించడం, చిన్నవయసులోనే కళ్లకు అద్దాలు తీసుకోవాల్సి రావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, దృష్టిని మెరుగుపరచుకోవడానికి.. కొన్ని ఆహార పదార్థాలను, అలాగే కొన్ని అలవాట్లను మన లైఫ్​లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

పండ్లు: పండ్లలో కావాల్సినన్నీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు విరివిగా లభిస్తాయి. ముఖ్యంగా బెర్రీలు, నారింజ, సిట్రస్​ పండ్లలో లభించే విటమిన్​ సి కళ్ల ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే కళ్ల దగ్గర రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దాంతో.. దృష్టి మెరుగవుతుంది.

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ - నిద్ర చాలకనే వచ్చాయనుకుంటున్నారా?

ఆకుకూరలు: ఆకుకూరలు పుష్కలంగా పోషకాలు కలిగిన ఆహారం. అందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్‌లు సమృద్ధిగా లభిస్తాయి. ఆకుకూరలు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బచ్చలికూర, పాలకూర, బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల కళ్లకు మేలు జరుగుతుంది. బీట్‌రూట్‌లోని ల్యూటిన్‌.. కంటి రక్త ప్రసరణను పెంచుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్ తప్పనిసరిగా తినాలి. ఇందులో ల్యూటిన్‌, బీటా కెరోటిన్‌ ఉంటాయి. ఇవి కళ్లు దెబ్బతినకుండా రక్షిస్తాయి.

కళ్లు పొడిబారుతున్నాయా? ఇలా చేస్తే హాయిగా ఉంటుంది!

నట్స్​: నట్స్​లో కూడా ఎన్నో రకాలు పోషకాలు ఉన్నాయి. ఫైబర్, ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు, మెగ్నీషియం, జింక్ సమృద్ధిగా ఉంటాయి. బాదం కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో 5 నానబెట్టిన బాదం గింజలు తీసుకుంటే.. కళ్లకు మేలు జరుగుతుంది. బాదంలో విటమిన్‌ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్‌ తగ్గించి.. కాంతిని పెంచుతాయి. అలాగే 1 టీ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇందులోని విటమిన్ ఇ.. వృద్ధాప్యంలో కాంతిని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా.. వేరుశెనగలోని విటమిన్‌ E కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒమేగా 3 ఆహారాలు, పాల ఉత్పత్తులు కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Optical Illusion Test for Your Eyes : మీ కంటి పవర్​కే పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న వాక్యాన్ని 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..!

ఇక అలవాట్ల పరంగా చూసుకుంటే..

  • తగినంత మొత్తంలో నీరు తాగడం వల్ల కళ్లు పొడిబారే సమస్య నుంచి రిలీఫ్​ పొందవచ్చు.
  • ఎక్కువ సేపు సెల్​ఫోన్​, ల్యాప్​టాప్​ స్క్కీన్​ చూడకూడదు. మధ్య మధ్యలో కొంత సమయం విరామం తీసుకోవాలి.
  • 20-20-20 నియమం పాటించాలి. అంటే ప్రతి 20 నిమిషాలకు 20 సెక్లన పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూడాలి.
  • చివరగా యూవీ కిరణాల నుంచి రక్షణ పొందాలి. అందుకోసం బయటికి వెళ్లినప్పుడు సన్​ గ్లాసెస్​ ధరించాలి.

చిన్నారుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు.. డిజిటల్​ తెరలే కారణం!

కళ్ల కింద డార్క్​ సర్కిల్స్​తో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే సెట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.