ETV Bharat / sukhibhava

చలికాలంలో మోకాళ్ల నొప్పులా? ఈ ఫుడ్స్​తో రిలీఫ్​ పొందండి!

Best Food to Relief from Knee Pain: చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య.. కీళ్ల నొప్పులు. మామూలుగా వయసు పెరిగే కొద్ది కీళ్లు అరిగి నొప్పులు మొదలవుతాయి. కానీ, ఇప్పుడు మారుతున్న లైఫ్‌స్టైల్, హ్యాబిట్స్ కారణంగా చాలామందిలో చిన్న వయసు నుంచే కీళ్ల సమస్యలు మొదలవుతున్నాయి. చలికాలంలో అవి ఇంకా ఎక్కువవుతాయి. వీటి నుంచి రిలీఫ్ పొందడం ఎలాగంటే..

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 3:53 PM IST

Best Food to Relief from Knee Pain in Telugu: ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పులు చిన్న వయసులోనే వస్తున్నాయి. సాధారణంగా వయసు పెరిగే కొద్ది ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు చిన్న ఏజ్​లోనే వస్తున్నాయి. అయితే దీనికి కారణాలు అనేకం. జీవనశైలిలో మార్పులు, చెడు అలవాట్లు, సరైన ఆహారం తినకపోవడం వల్ల ఏర్పడుతున్నాయి. సాధారణంగా గాయాలు, ప్రమాదాల వల్ల మోకాళ్లలో నొప్పి రావడం సహజం. ఇక చలికాలంలో అవి ఇంకా ఎక్కువవుతాయి. అసలు మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి? చలికాలంలో వీటి నుంచి రిలీఫ్ పొందడం ఎలాగంటే..

మోకాలి నొప్పి ఎందుకు వస్తుంది?: శరీరంలో కాల్షియం లేదా ప్రోటీన్ లోపం కారణంగా మోకాలి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. వీటి లోపం వల్ల కొన్నిసార్లు కీళ్ల వాపులు రావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం కొన్ని పదార్థాలను మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అవి ఏంటంటే..

పసుపు: యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్న పసుపు.. సహజంగానే ఆర్థరైటిస్ నివారణగా పనిచేస్తుంది. మోకాళ్ల నొప్పులను చాలావరకూ తగ్గిస్తుంది. కాబట్టి, రెగ్యులర్‌గా మీ ఫుడ్‌లో పసుపుని చేర్చవచ్చు. లేదంటే గోరువెచ్చని పాలల్లో పసుపును కలిపి తాగినా మంచి ఫలితం లభిస్తుంది. అలాగే పసుపును పేస్ట్​లాగా చేసి నొప్పి ఉన్న దగ్గర అప్లై చేసిన రిలీఫ్​ ఉంటుంది.

చలికాలంలో డేట్స్​ తినడం వల్ల లాభాలు ఇవే!-తెలిస్తే వదిలిపెట్టరు సుమీ!

అల్లం: ప్రతి ఒక్కరి వంటగదిలో నిత్యం కనిపిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మోకాళ్ల నొప్పులను తగ్గించడానికి సూపర్‌ఫుడ్‌గా ఉపయోగపడుతుంది. తాజా అల్లం, శొంఠి రూపంలో రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. మీ రోజువారి ఆహారంలో అల్లాన్ని ఉపయోగించవచ్చు. అల్లం శరీరంలో వాపుని ప్రోత్సహించే పదార్థాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది.

వెల్లుల్లి: భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పి, వాపు తగ్గుతుంది. దానిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు పెయిన్స్​ నుంచి రిలీఫ్​ అందిస్తాయి.

పీరియడ్స్​ నొప్పి భరించలేకున్నారా? ఈ ఫుడ్స్​తో రిలీఫ్​ పొందండి!

నట్స్​: గింజలు, విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వాల్‌నట్స్, బాదం, అవిసెలు, చియా, పైన్ సీడ్స్ వింటి గింజలు, విత్తనాలను చిన్న భాగాల్లో రెగ్యులర్‌గా తినడం వల్ల కీళ్ల వాపు నుంచి రిలీఫ్ అవ్వొచ్చు.

ఆకుకూరలు: ఆకుకూరలు.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి సహాయపడతాయి. బ్రోకలీ, కాలే, పాలకూర వంటి ఆకుకూరలు మంచి ఎంపికలు.

అలర్ట్​- ఈ లక్షణాలు ఉన్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే!

పండ్లు: యాపిల్స్, క్రాన్ బెర్రీస్, ఆప్రికాట్ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.

మెంతులు: మెంతులు.. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల, శీతాకాలంలో మోకాలి నొప్పిని నివారించడానికి ఇవి ప్రభావవంతమైన ఇన్ఫ్లమేటరీలుగా పనిచేస్తాయి. మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం వాటిని నమిలి తినాలి. మోకాళ్ల నొప్పులను నివారించడానికి ఇది ఒక సింపుల్ హోం రెమిడీ. జాయింట్ పెయిన్ నుంచి ఉపశమనం పొందడానికి మెంతుల పేస్ట్​ను కూడా అప్లై చేసుకోవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.

చలికాలంలో మీ జుట్టు డల్​గా ఉంటుందా? - ఈ టిప్స్‌ పాటిస్తే సిల్కీ హెయిర్​ గ్యారెంటీ!

త్వరగా నిద్రలేవలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించారంటే అలారం లేకుండానే మేల్కొంటారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.