ETV Bharat / sukhibhava

బరువు తగ్గాలా? రోజూ పైనాపిల్​ తింటే సులువుగా... - మధుమేహం అదుపులోకి రావడానికి చిట్కాలు

పైనాపిల్​ను రోజూ తినే ఆహారంలో భాగం చేసుకోమంటున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల పైనాపిల్​లో ఉన్న మాంగనీసు ఎముకలకు బలాన్ని ఇస్తుందని తెలిపారు. మరోవైపు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు వ్యాయామమే కాకుండా ఉదయం అల్పాహారంలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

benefits of pine apple
పైనాపిల్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
author img

By

Published : Oct 23, 2022, 10:56 AM IST

పోషకాలున్న అనాస తింటున్నారా! శరీరానికి ఎంతో మేలు చేసే ఈ పండును మీ రోజు తినే ఆహారంలో భాగం చేసుకోండి. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.

  • తక్షణ శక్తిని అందించడంలో పైనాపిల్ ఉపయోగపడుతుంది.
  • ఇందులో ఉండే విటమిన్‌ సీ, యాంటీ ఆక్సీడెంట్లు, ఫైబర్‌ శరీర పనితీరును మెరుగుపరిచేందుకు తోడ్పడుతాయి.
  • ఇందులో ఉండే మాంగనీసు ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.
  • ఏదైనా దెబ్బ తగిలి గాయాలైతే తొందరగా కోలుకునేందుకు సహాయపడుతుంది.
  • ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది.
  • సహజంగా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
  • రోజూ ఓ గ్లాసు పైనాపిల్ రసాన్ని తాగటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
  • పైనాపిల్‌ను ముక్కలుగా చేసుకుని కూడా తినేయచ్చు. దీంతో పైనాపిల్‌లో ఉండే ఫైబర్ కూడా శరీరానికి అందుతుంది.

మధుమేహం అదుపులో ఉండాలంటే..
మధుమేహం వచ్చిందని ఆహారం తినడం మానేయొద్దు.. దాన్ని అదుపులో పెట్టుకోవడానికి చక్కని మార్గాలెన్నో ఉన్నాయి. మందులు, శారీరక వ్యాయామమే కాదు..ఉదయపు అల్పాహారంలో మార్పులు చేసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చాలా చిన్న మార్పులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశాలెన్నో ఉన్నాయి.

ఇలా చేసి చూడండి..

  • అల్పాహారం మార్పులు చేసుకోవడంతో గ్లూకోజ్‌ను చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు.
  • ఉదయపు అల్పాహారంలో ఆకుకూరలు, కూరగాయలు, తాజాపండ్లు, ముడి ధాన్యాలు, కొవ్వులేని మాంసం, చేపలు, పప్పులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
  • ఏ పదార్థం తయారు చేసుకున్నా కూరగాయల ముక్కలు ఉండేలా చూసుకోవాలి. ఇడ్లీ సాధారణంగా తినే బదులు అందులో క్యారెట్‌ లేదా బీట్‌రూట్‌ తురుము వేసుకోవాలి.
  • ఏదో ఒకరకం పప్పుతో కాకుండా రకరకాల పప్పులను కలిపి వండుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • మినప గారెలకు బదులు రకరకాల పప్పులు కలిపి వడలుగా చేసుకోవాలి. క్యారెట్‌, పాలకూర వేస్తే మరీ బాగుంటుంది.
  • చపాతీ పుల్కా వంటివి చేసుకుంటే గోధుమ పిండితో కాకుండా మల్టీగ్రెయిన్‌ గోధుమపిండిని వినియోగించాలి.
  • పూరీలకు బదులు చపాతీలు, దానిలో మెంతుకూర వేసుకుని తింటే మంచిది. పాలకూర కూడా బాగుంటుంది.
  • తెల్ల బ్రెడ్‌ కాకుండా బ్రౌన్‌ బ్రెడ్‌ను గుడ్డుతో కలిపి తీసుకోవాలి.
  • మాంసం ఫ్రై కాకుండా కూరలా వండుకొని కాస్తంత తినొచ్చు.
  • ఒకే రకం నూనెలకు బదులుగా రెండు, మూడురకాల నూనెలున్న బ్లెండెడ్‌ ఆయిల్‌ వాడాలి.

ఇవీ చదవండి: నోటి ఆరోగ్యానికి వంట నూనెలు... ఇలా చేస్తే ఎన్నో ప్రయోజనాలు

శృంగారం మీద ఆసక్తి తగ్గుతోందా?.. అయితే కారణమిదే కావొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.