ETV Bharat / sukhibhava

Benefits Of Children Playing Outside : మీ పిల్లలను బయట ఆడుకోనివ్వడం లేదా? దృష్టి లోపాలు, ఊబకాయం గ్యారెంటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 8:09 AM IST

Benefits of Outdoor Playing : దసరా సెలవులు వస్తే పిల్ల‌లంతా ఇంట్లో క‌న్నా బ‌య‌టే ఎక్కువ‌గా గ‌డిపేవారు. అయితే అది కొన్నేళ్ల క్రితం మాట. ఇప్పుడేమో ఆడుకోవ‌డమనే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి.. ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్స్​కు అతుక్కుపోతున్నారు పిల్లలు. దీంతో లేనిపోని స‌మ‌స్య‌ల్ని కొని తెచ్చుకుంటున్నారు. పిల్ల‌లు ఆరుబ‌య‌ట ఆడుకోక‌పోవ‌డం క‌లిగే న‌ష్టాలు, నివార‌ణ మార్గాల గురించి ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

Benefits of Outdoor Playing
ఆరు బయట ఆడకోవడం వల్ల లాభాలు

Benefits of Outdoor Playing : ప్రస్తుతం పిల్లలంతా దసరా సెలవులతో ఇంటివద్దే ఉన్నారు. అయితే చాలా మంది పిల్లలు ఈ సెలవులను ఆటలతో ఎంజాయ్​ చేయకుండా.. ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్స్​కే అతుక్కుపోతున్నారు. శరీరానికి కాస్త కూడా అలసట ఇవ్వకుండా వీడియో గేమ్​లు, టీవీలతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో పిల్ల‌ల‌కు చిన్న వ‌య‌సులోనే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా దృష్టి లోపం, డ‌యాబెటిస్​తో ఎక్కువ శాతం మంది పిల్ల‌లు బాధ‌ప‌డుతున్నారు.

పిల్ల‌లో డిప్రెష‌న్‌, ఊబ‌కాయం వంటి స‌మ‌స్య‌లు పెర‌గ‌డానికి కార‌ణం వీడియోగేములు ఆడ‌టం, టీవీల‌కు అతుక్కుపోవ‌డం. ఈ స‌మస్య‌ల‌తో డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళితే.. ఆహారంలో మార్పులు, వ్యాయామం చేయాల‌ని చెబుతున్నారు. దీంతో పాటు కొత్త‌గా ఇప్పుడు ఇందులో మ‌రో అంశాన్ని కూడా చేర్చుతున్నారు. అదే రోజూ కొంత సేపు ఆరుబ‌య‌ట ఆడుకోవ‌డం. కొంత స‌మ‌యం ప్ర‌కృతిలో గ‌డ‌ప‌డం.. దాన్ని ఆస్వాదించడం. ఆరుబ‌య‌ట ఆట‌ల్లో, బ‌య‌ట ప‌చ్చ‌ద‌నంలో గ‌డిపే పిల్ల‌ల్లో.. మాన‌సిక ప‌రిపక్వ‌త ఎక్కువ‌గా ఉంటుంద‌ని వారు చెబుతున్నారు. ఈ విషయం ప‌లు అధ్య‌య‌నాల్లోనూ వెల్ల‌డైందని అంటున్నారు.

ఈ మ‌ధ్య‌కాలంలో పిల్ల‌ల్లో క‌న‌బ‌డుతున్న కొన్ని స‌మ‌స్య‌ల‌కు.. నేచ‌ర్ డెఫిసిట్ డిజార్డ‌ర్ అనే పేరు పెట్టారు వైద్య నిపుణులు. ప్ర‌కృతితో గ‌డ‌ప‌క‌పోవ‌డం వ‌ల్ల వ‌స్తున్న స‌మ‌స్య‌గా దీన్ని అభివ‌ర్ణిస్తున్నారు. పిల్ల‌ల్ని బ‌య‌ట‌కు తీసుకెళ్లి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత‌.. వారు చ‌దువుకోవ‌డం, క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ఉండ‌టం మీద అధ్య‌యనం చేసిన‌ప్పుడు కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర‌ విష‌యాలు వెల్లడయ్యాయి. ఇందులో వారి ఏకాగ్ర‌త పెరిగింది. అంతేకాకుండా.. ప‌చ్చ‌ద‌నం, నీళ్ల ప్ర‌వహం, ప‌క్షుల కిల‌కిల‌ మ‌ధ్య కొంత సేపు గ‌డిపిన త‌ర్వాత జ్ఞానేంద్రియాలు చురుగ్గా ప‌నిచేస్తున్నాయ‌ని గ్ర‌హించారు.

ఈ రోజుల్లో 70 శాతం మంది పిల్ల‌లు సెల్ ఫోన్‌, ట్యాబ్స్, వీడియో గేముల‌పై అధికంగా సమయం వెచ్చిస్తున్నారు. దీని వ‌ల్ల వ‌చ్చే న‌ష్టాలు త‌ల్లిదండ్రుల‌కు తెలిసినా ఏం చేయ‌లేక‌పోతున్నారు. దీని వ‌ల్ల పిల్ల‌లు బ‌రువు పెరుగుతారు. ఏకాగ్ర‌త లోపిస్తుంది. ఎందుకంటే.. అప్ప‌టిదాకా ఫోన్​లో వీడియోలు చూసి చూసి స‌డెన్​గా క‌ద‌ల‌ని అక్ష‌రాల‌పై దృష్టి పెట్ట‌లేరు. ఇది ఇలాగే కొన‌సాగితే.. రాను రాను డ‌ల్​గా త‌యారవుతారు.

ఫీల్డ్ ట్రిప్పుల్లో భాగంగా అడ‌వికి వెళ్లివ‌చ్చిన పిల్ల‌ల్లో గుండె ద‌డ తగ్గ‌డం, ఒత్తిడి కలిగించే హార్మోన్లు తగినంత స్థాయిలోనే ఉండ‌టం, ఆతృత త‌గ్గ‌డం గ‌మ‌నించారు. ఇలా త‌ర‌చూ వెళ్లే వారిలో బ‌రువు కూడా నియంత్ర‌ణ‌లో ఉండ‌టం క‌నుగొన్నారు. విశాల‌మైన పార్కున‌కు ద‌గ్గ‌ర‌ల్లో ఉంటూ రోజూ ప‌చ్చ‌ద‌నంలో గ‌డిపే పిల్ల‌లో ఊబ‌కాయం లేక‌పోవ‌డం, ఎత్తుకు త‌గ్గ బ‌రువు ఉండ‌టం కూడా చూశారు. దాదాపు 3 వేల మంది విద్యార్థుల మీద జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైన ఫ‌లితాలివి.

నిజానికి ఈ డిజిట్ యుగంలో హ్ర‌స్వ‌ దృష్టి లోపం తీవ్రంగా వేధిస్తోంది. కానీ ప‌చ్చ‌ద‌నంలో గడిపే పిల్ల‌లో ఇది త‌గ్గింద‌ని ఆ ప‌రిశోధ‌న‌లో తేలింది. అయితే.. ప‌చ్చ‌ద‌నంలో గ‌డ‌ప‌డం అంటే ఏ అడ‌వికో వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. మ‌న చుట్టూ ఉన్న ప్ర‌కృతిలో న‌డ‌వ‌డం, ద‌గ్గ‌ర్లోని పార్కుల్లో గ‌డ‌ప‌డం ద్వారా కొంత మేర ప్ర‌యోజ‌నం కనిపిస్తుంది.

అతిప్రేమ స‌రైంది కాదు..
త‌ల్లిదండ్రుల్లో పిల్ల‌ల మీదున్న అతి ప్రేమ వ‌ల్ల కూడా వాళ్ల‌కు న‌ష్టం క‌లుగుతుంది. బ‌య‌టికెళ్లి ఆడుకుంటే వారు ఎక్క‌డ గాయాల పాల‌వుతారో అని భ‌య‌ప‌డి.. ఇంట్లోనే కూర్చోబెట్టి ఫోన్ ఇస్తున్నారు. కానీ ఇది స‌రైంది కాదు. బ‌య‌టికెళ్లి ఆడిన‌ప్పుడే వారి శ‌రీరానికి త‌గిన వ్యాయామం అంద‌డంతోపాటు తోటి పిల్ల‌ల‌తో ఎలా మాట్లాడాలి, ప్ర‌వ‌ర్తించాలో తెలుస్తుంది.

ఇలా చేయండి..

  • వారానికి క‌నీసం 3 సార్లు 20 నిమిషాల‌కు త‌గ్గ‌కుండా పార్కులో, ఆహ్లాదం క‌లిగించే ప్రాంతంలో కూర్చోబెట్టాలి.
  • ఆరుబ‌య‌ట వ్యాయామం చేయించ‌డం అల‌వాటు చేయాలి.
  • టీవీ, కంప్యూట‌ర్ తెర‌ల‌కు అంకిత‌మ‌య్యే స‌మ‌యాన్ని త‌గ్గించి.. దాన్ని ఆరుబ‌య‌ట ఆడుకోవ‌డానికి కేటాయించాలి.
  • శారీర‌కంగా శ్ర‌మ‌ప‌డితే.. వారి జీవిత చ‌క్రం కూడా చురుగ్గా మారుతుంది. శ‌రీరం దృఢంగా త‌యార‌వ‌డంతో పాటు ఆత్మ విశ్వాసం పెరిగి, ఆలోచ‌నా విధానం మెరుగుప‌డుతుంది.

ప్ర‌స్తుతం ప్ర‌తి అయిదుగురిలో ఒక‌రు మాత్ర‌మే ఆరుబ‌య‌ట ఆడుకుంటున్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఓవ‌రాల్​గా 35 శాతం మంది మాత్ర‌మే ఇలా చేస్తున్నారు. చుట్టూ ఉన్న ప్ర‌కృతి అందాలు ఆస్వాదించ‌డం పిల్ల‌ల‌కు నేర్పితే.. వారి మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. పిల్ల‌లు అటు శారీర‌కంగా, ఇటు మాన‌సికంగా ఆరోగ్యంగా ఉండాల‌ని త‌ల్లిదండ్రులు కోరుకుంటే.. వాళ్ల‌ను ఆడుకోవ‌డానికి గ్రౌండ్​కి పంప‌డం ప్రోత్స‌హించాలి.

ఆరు బయట ఆడకోవడం వల్ల లాభాలు

Cardamom For Weight Loss : అధిక బరువు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా?.. యాలకులతో చెక్​!

How to Build Self Confidence in Children : మీ పిల్లలు ఆత్మవిశ్వాసం కోల్పోయారా? ప్రధాన కారణం మీరేనట.. ఈ టిప్స్​ ఫాలో అవ్వండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.