ETV Bharat / sukhibhava

ఎన్ని చేసినా బరువు తగ్గడం లేదా? 30-30-30 రూల్​ ట్రై చేస్తే అంతా సెట్​! - 30 30 30 రూల్​తో బరువు తగ్గడం ఎలా

30 30 30 Rule For Weight Loss : అధిక బరువుతో బాధపడేవారు వెయిట్​లాస్ అవ్వడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారాన్ని తక్కువగా తినడం, వ్యాయామం చేసి బరువు తగ్గాలనుకుంటారు. అయితే బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడే 30-30-30 రూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

30 30 30 Rule For Weight Loss In Telugu
30 30 30 Rule For Weight Loss
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 10:55 AM IST

30 30 30 Rule For Weight Loss : బరువు ఎక్కువగా ఉన్నామని తెలిస్తే చాలు చాలామంది తీసుకునే ఆహారాన్ని చాలా వరకు తగ్గించేస్తుంటారు. ఆహారం తక్కువగా తింటే బరువు తగ్గుతామని చాలామంది భావిస్తుంటారు. అలాగే మరికొందరు అతిగా వ్యాయామాలు చేస్తుంటారు. తమ శరీరాన్ని కష్టపెట్టడం ద్వారా బరువు తగ్గుతామని మరికొందరి ఆలోచన.

బరువు తగ్గడం అనేది వెంటనే జరిగే ప్రక్రియ కాదని ముందుగా అందరూ తెలుసుకోవాలి. డైటింగ్ చేయడం, మితిమీరిన వ్యాయామం చేయడం, క్రాష్ డైట్ల పేరుతో శరీరాన్ని ఇబ్బంది పెట్టడం వంటి వాటితోచాలామంది ఆనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటారు. ఇలా కాకుండా ఆరోగ్యకర విధానంలో బరువు తగ్గడానికి అమెరికాకు చెందిన పోషకాహార నిపుణులు మిచెల్ రౌథెన్‌స్టెయిన్ 30-30-30 రూల్​ గురించి వివరిస్తున్నారు. ఆ రూల్​ ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు చూద్దాం.

30-30-30 రూల్​ ఎంత వరకు ప్రామాణికం?
బరువు తగ్గడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాల్లో 30-30-30 రూల్​ ఎంతో ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపించకుండా, అధిక బరువు నుంచి విముక్తి పొందడానికి ఇది ఉపయోగపడుతుంది.

30శాతం క్యాలరీలను తగ్గించడం ద్వారా
అధిక బరువును తగ్గించడంలో భాగంగా ముందుగా 30శాతం క్యాలరీలను తగ్గించి తీసుకోవడం అనేది 30-30-30 రూల్​లో ఓ భాగం. అంటే శరీరానికి కావాల్సిన క్యాలరీల కన్నా 30శాతం తగ్గించి తీసుకోవాలన్నది నియమం. సాధారణంగా మహిళలకు రోజుకు 2000 క్యాలరీల శక్తి, పురుషులకు 2500 క్యాలరీల శక్తి అవసరం. ఈ రూల్ ప్రకారం అందులో 30శాతం తగ్గించి తీసుకోవాలి. అంటే మహిళలు తమ శరీరానికి 1400 క్యాలరీలను, పురుషులు 1750 క్యాలరీలను తీసుకోవాల్సి ఉంటుంది.

30 నిమిషాల వ్యాయామం
అధిక బరువును తగ్గించడానికి ఉన్న మరో నియమం రోజులో కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం. చాలామంది శరీరానికి తగిన శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరగడం మనం గమనిస్తుంటాం. అయితే 30 నిమిషాల వ్యాయామాన్ని ముందుగా నడక, జాగింగ్, స్విమ్మింగ్​ లాంటి వాటితో ప్రారంభించి తర్వాత కఠినమైన వ్యాయామాలు చెయ్యాలి.

భోజనానికి 30 నిమిషాల కేటాయింపు
చాలామంది తాము భోజనం చేసేటప్పుడు ఏకాగ్రత లేకుండా భోజనం చేస్తుంటారు. ఆహారం తీసుకునేటప్పుడు టీవీలు, ఫోన్లు, లేదంటే ల్యాప్​టాప్​ చూస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఈ అలవాటు బాగా ఎక్కువైపోయింది. వాస్తవానికి ఆహారాన్ని ఏకాగ్రతతో, బాగా నమిలి తినాలి. ఇలా ఆహారాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ తింటే దానిలోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. ఆహారాన్ని తీసుకునేటప్పుడు 30 నిమిషాలు కేవలం దాని కోసమే కేటాయించాలని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చని అంటున్నారు.

అధిక బరువుతో బాధపడే వాళ్లు 30శాతం క్యాలరీలను తగ్గించి తీసుకోవడం, 30 నిమిషాలు వ్యాయామం చేయడం, 30 నిమిషాలు భోజనానికి కేటాయించడం అనే 30-30-30 రూల్​ని ఫాలో అయితే ఎటువంటి కఠోరమైన డైట్​ పాటించకుండానే బరువు తగ్గవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఎన్ని చేసినా బరువు తగ్గడం లేదా? 30-30-30 రూల్​ ట్రై చేస్తే అంతా సెట్​!

మీరు పడుకునే ముందు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా? - ఆ నష్టం గ్యారెంటీ!

ఇంట్లో బియ్యం పురుగు పడుతోందా? - ఇలా చేశారంటే ఏడాదంతా నిల్వ చేసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.