ETV Bharat / sukhibhava

కరోనా వేళ... పోషకాహారంతో రక్షణ - World Nutrition Report latest news

ప్రపంచవ్యాప్తంగా కోరలు చాచిన కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపడం లేదనేది సుస్పష్టం. సహజంగానే పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వైరస్‌ ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం, స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, లింగపరమైన విచక్షణ, ఇతర సామాజిక నిబంధనల వంటి బహుళ పథకాల సమగ్ర కార్యాచరణతో పౌష్టికాహార కల్పన అవసరం.

HEALTH TECHNIQUES
కరోనా వేళ... పోషకాహారంతో రక్షణ
author img

By

Published : May 18, 2020, 7:51 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

లు దేశాల్లో ప్రజల పోషకాహారలోపం వారిపాలిటశాపంలా మారుతోంది. ఇటీవల విడుదలైన ప్రపంచ పోషకాహార నివేదిక- ఆయా దేశాల్లో పౌష్టికాహార లభ్యతలో ప్రాంతాలు, ప్రజల మధ్య తీవ్ర అసమానతలు ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కోరలు సాచిన మహమ్మారి అన్ని వర్గాల ప్రజలపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపడం లేదనేది సుస్పష్టం. సహజంగానే పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వైరస్‌ ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మధుమేహం, స్థూలకాయం వంటి దీర్ఘకాలిక జీవనశైలి సంబంధ వ్యాధులతో పోరాడుతున్న వారిలోనూ వైరస్‌ ముప్పు ఎక్కువగా పొంచి ఉంది. ప్రపంచబ్యాంకు, ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రకారం పౌష్టికాహార లోపం అనేది ప్రజల పనిచేసే శక్తిని, ఆరోగ్యాన్ని, మానవ మేధో సామర్ధ్యాన్ని తద్వారా స్థూల దేశీయోత్పత్తిలో 16 శాతంపై ప్రభావాన్ని చూపుతోంది. ఆరోగ్యం, స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, లింగపరమైన విచక్షణ, ఇతర సామాజిక నిబంధనల వంటి బహుళ పథకాల సమగ్ర కార్యాచరణతో కూడుకుని ఉన్నదే పౌష్టికాహార కల్పన.

సుదూరంగా లక్ష్యాలు

పౌష్టికాహార కల్పన దిశగా 2025 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో భారత్‌ సహా 88 దేశాలు వెనుకంజలో ఉన్నాయని తాజా ప్రపంచ పోషకాహార నివేదిక వెల్లడించడం క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. దేశీయంగానూ భారతలో పౌష్టికాహార లభ్యతలో అత్యధిక స్థాయిలో అసమానతలున్నట్లు ఈ నివేదిక గుర్తించడం గమనార్హం. 2012లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులోనే స్త్రీ, శిశువులు, కౌమారదశలోని బాలబాలికల్లో పౌష్టికాహార కల్పన దిశగా 2025 నాటికల్లా సాధించాల్సిన లక్ష్యాలుగా ఆరు అంశాలపై దృష్టి సారించారు. అయిదేళ్లలోపు చిన్నారుల్లో ఎదుగుదల లోపాన్ని 40 శాతానికి తగ్గించడం, 19 నుంచి 49 ఏళ్లలోపు వయసున్న మహిళల్లో రక్తహీనతను సగానికి తగ్గించడం, తక్కువ బరువున్న శిశువుల జననాన్ని 30 శాతం తగ్గించడం, చిన్నారుల్లో అధిక బరువును తగ్గించడం, ఆర్నెల్లలోపు వయసు శిశువుల్లో తల్లిపాల వినియోగాన్ని పెంచడం, బాల్యంలోని బలహీనత సమస్యలు అయిదు శాతాన్ని మించకుండా చూడటం వంటివి ఆ లక్ష్యాలు. నిర్దేశిత లక్ష్యాలకుగాను భారత్‌ నాలుగు అంశాల విషయంలో 2025 నాటికల్లా లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితులు లేవని ఈ నివేదిక వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ దశాబ్ది చివరి నాటికి సుస్థిరాభివృధ్ధి లక్ష్యసాధనే ఆశయంగా సాగుతున్న క్రమంలో భారత్‌లో పౌష్టికాహారానికి సంబంధించి కొన్ని కీలకమైన సవాళ్లు ముందున్నాయి. స్త్రీలు, చిన్నారుల్లో పౌష్టికాహారానికి సంబంధించి దేశీయంగానే రాష్ట్రాల మధ్య అంతరాలు ఉన్నాయి. పౌష్టికాహార లోపం చిన్నారుల మరణంతోపాటు, వయోజనుల్లో బలహీనతకు, వైకల్యానికి దారితీస్తోంది. దేశంలో అయిదేళ్లలోపు వయసున్న చిన్నారులు పౌష్టికాహార లోపంతో మృత్యువాత పడకుండా చూడాలంటే పోషకాహార కల్పనపై నిరంతర దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇటీవల నిర్వహించిన జాతీయ సమగ్ర పోషకాహార సర్వే కూడా పోషకాహార లోపం వల్ల చిన్నారుల్లో తలెత్తుతున్న సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ప్రజాచైతన్యం అవసరం

సేద్యం- సాగు రంగాల్లో ప్రోత్సాహకాలు, వైవిధ్యభరితమైన ఆహార ధాన్యాల వినియోగం, మెరుగైన సమతుల- పోషకాహార సమీకరణకు ప్రభుత్వ సహాయం, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఐసీడీఎస్‌ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వంటి పథకాల అమలు, విధానపరమైన కార్యాచరణలో వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో పౌష్టికాహార సమస్యను అధిగమించవచ్చు. కౌమారదశ బాలల్లో, గర్భిణులు, యువతకు సరైన పౌష్టికాహారాన్ని అందించడం, విచ్చలవిడిగా మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్న అనారోగ్యకరమైన చిరుతిళ్లు, పానీయాలను నియంత్రించడం, ప్రజల్లో పౌష్టికాహార సంబంధిత జ్ఞానాన్ని, అవగాహనను మెరుగు పరిచే ప్రయత్నాలను విస్తృతపరచడం వంటి విషయాల్లో ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చిన్నవయసులో ఎదురవుతున్న పౌష్టికాహార లోపం ముదిమి వయసు జీవితానికి ప్రమాదకరంగా మారుతోంది. పౌష్టికాహార లోపం మూలంగా ఎదురవుతున్న బహుళ సమస్యలను మనం సరిగ్గా అవగాహన చేసుకోకపోవడంవల్లే పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ సమస్యకు సంబంధించి పలు అధ్యయనాల్లో వెల్లడైన సమాచారాన్ని మదింపు చేసుకోవాలి. ఈ అంశాలను సమాజానికి అందుబాటులో ఉంచాలి. క్షేత్రస్థాయి పరిస్థితులకు సంబంధించిన వాస్తవిక సమాచారాన్ని అందుబాటులో ఉన్న అంగన్‌వాడీలు, ఆరోగ్య కార్యకర్తల నుంచి తెప్పించుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సవరించి, విడుదల చేసిన ఆవశ్యక పోషక విలువల మార్గదర్శకాలను దేశీయ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలి. రానున్న కాలంలో పోషకాహార లోపం సమస్యను ఎదుర్కోవడానికి, తద్వారా కరోనా వైరస్‌ వంటి మహమ్మారులతో ఎదురొడ్డి పోరాడటానికి ప్రభుత్వాలు, బాధ్యతాయుతమైన పౌర సమాజం శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

- డాక్టర్‌ జీవీఎల్‌ విజయ్‌కుమార్‌ (రచయిత- భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు)

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.