చంద్రబాబు కడప జిల్లా పర్యటనను వైకాపా నేతలు తప్పుబట్టారు. ఈనేల 25 నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు ఆరు మాసాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కడప జిల్లాలో శాంతిభద్రతలకు ఏమైనా విఘాతం కల్గిందని ఇక్కడి వస్తున్నారా అని వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రశ్నించారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని... రాష్ట్రంలోనూ మనుగడ కష్టమేనని రఘురామిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి