కడప శివానందపురంలో ముగ్గురు తెదేపా కార్యకర్తలపై తీవ్రమైన దాడి జరిగింది. ఇది వైకాపా కార్యకర్తల పనేనని బాధితులు ఆరోపించారు. "శివానందపురానికి చెందిన బ్రహ్మయ్య సతీమణి గీతాంజలి.. 15వ డివిజన్ కు తెదేపా నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఆ నాటి నుంచి వైకాపా కార్యకర్తలు ఆమెను నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించారు" అని బాధితులు తెలిపారు.
"ఇంతలో లాక్ డౌన్ వచ్చింది. సమస్య సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ.. వైకాపా నేతలు మళ్లీ బ్రహ్మయ్య ఇంటిపై దాడికి దిగారు. తాగి వచ్చి కొట్టారు. అడ్డువచ్చిన బ్రహ్మయ్య మేనల్లుడు నిఖిల్, భార్గవ కుమార్ ను చితకబాదారు. వారి తలకు బలమైన గాయాలయ్యాయి. అక్కడిత ఆగకుండా కులం పేరుతోనూ దుర్భాషలాడారు" అని బాధితులు ఆరోపించారు. బాధితులు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: