Sandalwood Smugglers Arrest: వైఎస్సార్ జిల్లా నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. రైల్వేకోడూరు, రాజంపేట అటవీ ప్రాంతం నుంచి తరలిస్తుండగా 9మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి వద్దనుంచి సుమారు కోటిన్నర రూపాయల విలువగల.. ఒకటిన్నర టన్ను ఎర్రచందనం దుంగలు, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో రైల్వేకోడూరుకు చెందిన ఇద్దరిపై.. పీడీయాక్టు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. జిల్లాలో ఎక్కడ స్మగ్లింగ్ చేసినా పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.
ఇవి చదవండి: