YS Vivekananda Reddy murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అధికారుల నుంచి నిందితుల వరకు కేసుకు సంబంధం ఉన్నవారికి ఇబ్బందులు తప్పడం లేదు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న దేవ రెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టులో వాంగ్ములం ఇచ్చారు. వివేకా కేసులో తన భర్తను అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. మరో ఆరుగురుని కూడా సీబీఐ విచారించాలని కోరుతూ తులసమ్మ ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హత్య కేసులో వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆయన బావ మరిది శివ ప్రకాష్ రెడ్డి, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, బీటెక్ రవి, రాజేశ్వర్ రెడ్డి, నీరు గుట్టు ప్రసాద్‌ల ను సీబీఐ విచారించే విధంగా ఆదేశించాలని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ వేసిన తొమ్మిది నెలల తర్వాత పులివెందుల కోర్టు ఇవాళ తులసమ్మ వాంగ్మూలం నమోదు చేసింది. పులివెందుల కోర్టుకు హాజరైన తులసమ్మ మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.
ఇవీ చదవండి: