తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి ఆరోపించారు. ట్రాక్టర్ పరికరాలు, సాగుపనిముట్లు చోరీకి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు వైఎస్ఆర్ జిల్లా తొండూరు పీఎస్‌లో దస్తగిరి ఫిర్యాదు చేశారు. దస్తగిరి.. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారి కీలక సాక్షిగా ఉన్న విషయం తెలిసిందే.
ఇదీచదవండి: Viveka Murder Case: "నాకు ఇచ్చిన గన్మెన్లు నాతో ఉండట్లేదు"